Home /News /sports /

INDIA AIMS CLEAN SWEEP AT EDEN TODAY CHECK INDIA PLAYING XI 3RD T20 JNK

IND vs NZ: క్లీన్ స్వీప్‌పై టీమ్ ఇండియా కన్ను.. ప్రయోగాలకు సిద్దపడుతున్న ద్రవిడ్.. అవేశ్ ఖాన్‌కు చోటు?

క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమ్ ఇండియా (PC: BCCI)

క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమ్ ఇండియా (PC: BCCI)

IND vs NZ: న్యూజీలాండ్ - ఇండియా మధ్య మూడో టీ20 ఇవాళ రాత్రి ఈడెన్ గార్డెన్‌లో జరుగనున్నది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమ్ ఇండియా భావిస్తుండగా.. కనీసం ఆఖరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని న్యూజీలాండ్ అనుకుంటున్నది.

ఇంకా చదవండి ...
  టీమ్ ఇండియా (Team India) మరో స్వదేశీ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్దపడుతున్నది. ప్రపంచ కప్‌లో (T20 World Cup) కనీసం సూపర్ 12 (Super 12) దాటకుండా అడ్డుకున్న న్యూజీలాండ్‌పై (New Zealand) ప్రతీకారం తీర్చుకునేలా ఇప్పటికే రెండు టీ20లు గెలిచిన భారత జట్టు.. ఇవాళ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరుగనున్న చివరి టీ20 కూడా విజయం సాధించి సిరీస్‌ను వైట్ వాష్ చేయాలని భావిస్తున్నది. మూడో మ్యాచ్‌లో ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉన్నా... మ్యాచ్‌ను మాత్రం చేజార్చుకోవద్దని టీమ్ ఇండియా భావిస్తున్నది. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆడుతున్న తొలి టీ20 సిరీస్ కావడంతో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఈ విజయం తప్పకుండా భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశం ఉన్నది. మరోవైపు ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి బాధ మరిచిపోక ముందే టీమ్ ఇండియాపై వరుసగా 2 టీ20 మ్యాచ్‌లు ఓడిపోయింది. కనీసం చివరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని బ్లాక్ క్యాప్స్ భావిస్తున్నాయి.

  టీమ్ ఇండియా చివరి టీ20లో యువకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్‌లకు చివరి మ్యాచ్‌లో చోటు కల్పించి ప్రయోగం చేయాలని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ టీమ్ ఇండియా తరపున అరంగేట్రం చేశారు. ఇప్పుడు బెంచ్ మీద ఉన్న రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్లకు చోటు కల్పించాలని భావిస్తున్నది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రుతురాజ్ ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు తీసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ధావన్ నేతృత్వంలో శ్రీలంకలో పర్యటించిన టీమ్ ఇండియాలో చోటు సంపాదించి రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన మధ్యప్రదేశ్ ఆటగాడు అవేశ్ ఖాన్ ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది. ఐపీఎల్‌లో వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులోకి వచ్చిన అవేశ్ ఖాన్ తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే వీరిద్దరి కోసం సినీయర్లు అయిన భువనేశ్వర్, దీపక్ చాహర్, అశ్విన్, అక్షర్‌లలో ఇద్దరికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నది.

  Double Hat-trick: దేశవాళీ క్రికెట్‌లో సంచలనం.. డబుల్ హ్యాట్రిక్ సాధించిన విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే   ఇక కివీస్ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నది. ఆ జట్టులో కేన్ విలియమ్‌సన్, డెవాన్ కాన్వే లేకపోవడం బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఓపెనర్లు గుప్తిల్, డారెల్ మిచెల్ రాణిస్తున్నారు. ఫస్ట్ డౌన్‌లో వస్తున్న చాప్‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో జేమ్స్ నీషమ్, సీఫర్ట్ ఇంత వరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. వీళ్లు రాణిస్తే కివీస్ జట్టు భారీ లక్ష్యం సెట్ చేయడానికి లేదా ఛేజ్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కివీస్ బౌలర్లు మాత్రం కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. కానీ మరింత ప్రభావ వంతంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పిన్నర్లకు అనుకూలించే ఈడెన్ గార్డెన్‌లో రాత్రి మంచు ప్రభావం ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఫిల్డింగ్ చేసే అవకాశం ఉన్నది.

  జట్ల అంచనా

  ఇండియా : రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, యజువేంద్ర చాహల్

  న్యూజీలాండ్ : మార్టిన్ గప్తిల్, డారిల్ మిచెల్, మార్క్‌చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సిఫెర్ట్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), ఇష్ సోథి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
  Published by:John Kora
  First published:

  Tags: India vs newzealand, Rahul dravid, Rohit sharma, Team india

  తదుపరి వార్తలు