Home /News /sports /

INDIA AIM NO 1 SPOT IN ICC TEST RANKINGS WILL SERIES WIN OVER KIWIS MAKE INDIA NO 1 JNK

Team India: టీమ్ ఇండియా టెస్టుల్లో మళ్ళీ వరల్డ్ నెంబర్ 1 అయ్యేనా? అలా కావాలంటే ఏం చేయాలి?

టీమ్ ఇండియా టెస్టుల్లో నెంబర్ 1 అయ్యేనా? (PC: blackcaps)

టీమ్ ఇండియా టెస్టుల్లో నెంబర్ 1 అయ్యేనా? (PC: blackcaps)

Team India: టీమ్ ఇండియా ప్రస్తుతం పాయింట్ల పరంగా అగ్రస్థానంలో ఉన్నది. ఇండియాకు 2987 పాయింట్లు ఉండగా న్యూజీలాండ్‌కు 2764 పాయింట్లు ఉన్నాయి. అందరి కంటే ఎక్కువగా ఇంగ్లాండ్ 3753 పాయింట్లు కలిగి ఉన్నది. అయితే టీమ్ ఇండియా టెస్టు సిరీస్‌నుకూడా క్లీన్ స్వీప్ చేస్తే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది.

ఇంకా చదవండి ...
    వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ 2019-21ను (WTC Final) భారత జట్టు (Team India) నెంబర్ 1 హోదాలో ఆడింది. కానీ న్యూజీలాండ్‌తో (New Zealand) ఓడిపోయి అగ్రస్థానాన్ని కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ భాగంగా భారత జట్టు ఒక్క న్యూజీలాండ్‌తో తప్ప అన్ని దేశాలపై విజయాలు సాధించింది. ఆ సీజన్‌లో కివీస్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో దారుణంగా ఓడిపోవడమే కాకుండా.. ఫైనల్‌లో కూడా ఓడిపోయి టైటిల్‌కు దూరమైంది. ఆస్ట్రేలియా (Austalia), వెస్టిండీస్ (West Indies) వంటి విదేశీల పిచ్‌లపై భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. కానీ న్యూజీలాండ్‌ను మాత్రం ఓడించలేకపోయింది. టైటిల్‌ను మాత్రమే కాకుండా నెంబర్ 1 స్థానాన్ని కూడా న్యూజీలాండ్‌కు కోల్పోయింది. ఇక ప్రస్తుతం 2021-23 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తొలి సిరీస్ ఇంగ్లాండ్-ఇండియాల మధ్య జరిగింది. టీమ్ ఇండియా 2-1 తేడాతో ఆ సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ అగ్రస్థానాన్ని మాత్రం అందుకోలేక పోయింది. మరి మరో రెండు రోజుల్లో న్యూజీలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్నది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు గెలిస్తే మళ్లీ టాప్ ర్యాంక్ పొందుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు టెస్టు సిరీస్‌ను కూడా 2-0తో క్లీన్ స్వీప్ చేసే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉన్నది. టీమ్ ఇండియా ప్రస్తుతం పాయింట్ల పరంగా అగ్రస్థానంలో ఉన్నది. ఇండియాకు 2987 పాయింట్లు ఉండగా న్యూజీలాండ్‌కు 2764 పాయింట్లు ఉన్నాయి. అందరి కంటే ఎక్కువగా ఇంగ్లాండ్ 3753 పాయింట్లు కలిగి ఉన్నది. అయితే ఐసీసీ ర్యాంకులను పాయింట్ల బట్టి కాకుండా రేటింగ్స్ బట్టి నిర్ణయిస్తారు. న్యూజీలాండ్ 126 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా 119 రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నది. భారత జట్టు రెండు టెస్టులను కూడా గెలిస్తే రేటింగ్ పాయింట్లను బట్టి అగ్రస్థానానికి చేరుకుంటుంది. అయితే ఒక మ్యాచ్ గెలిచి ఒకటి డ్రా చేసినా అగ్రస్థానాన్ని మాత్రం పొందలేదు.




    మరోవైపు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ పాయింట్స్ టేబుల్‌లో ఇండియానే అగ్రస్థానంలో ఉన్నది. దాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇండియా తప్పకుండా గెలవాల్సి ఉన్నది. అయితే ఈ సీజన్‌లో న్యూజీలాండ్ జట్టుఇంకా బోణీ కొట్టలేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను డిఫెండ్ చేసుకోవాలంటే న్యూజీలాండ్ ఈ సారి చాలా కష్టపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియానే ఫేవ‌రెట్‌గా బరిలోకి దిగుతున్నది. ఇక్కడి పిచ్‌లు భారత జట్టుకు అనుకూలంగా ఉంటాయి. అందులో స్వదేశంలో ఇండియాను ఓడించాలంటే విదేశీ జట్లకు చాలా కష్టమే. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టు చెన్నైలో ఇండియాను ఓడించింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు టెస్టులు ఓడిపోయింది. ఇక్కడి పిచ్‌లపై భారత స్పిన్నర్లు చెలరేగిపోవడమే కాకుండా బ్యాటర్లు కూడా భారీ స్కోర్లు సాధిస్తుంటారు.

    IPL 2022: 'మా ఇద్దరినీ ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం లేదు'.. బాంబు పేల్చిన సీనియర్ టీమ్ ఇండియా క్రికెటర్



     అక్షర్ పటేల్, అశ్విన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (తొలి టెస్టుకు) అందుబాటులో లేకపోవడం లోటే అని చెప్పుకోవచ్చు. మరోవైపు న్యూజీలాండ్ జట్టు టెస్టు ఫార్మాట్‌లో తిరుగులేని విజయాలు సాధించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించగలిగే బ్యాటర్లు, బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. కేన్ విలియమ్‌సన్ టెస్టు జట్టులో ఉండటం పెద్ద బలం. రాస్ టేలర్ వంటి సీనియర్ కూడా జట్టుతో పాటు ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో కైల్ జేమిసన్, ట్రెంట్ బౌల్ట్ తప్పకుండా ఇండియాపై ఒత్తిడి తేగలరు. వీరిద్దరికీ భారత పిచ్‌లపై అవగాహన ఉన్నది. అజింక్య రహానే నేతృత్వంలోని టీమ్ ఇండియా తొలి టెస్టులో బ్యాటింగ్ పరంగా పెద్ద సవాలను ఎదుర్కోనున్నది. అయితే నాణ్యమైన బౌలర్లు ఉండటం ఇండియాకు బాగానే కలసి రానున్నది.
    Published by:John Kora
    First published:

    Tags: ICC, India vs newzealand, Team india, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు