Home /News /sports /

IND W VS WI 4TH T20I ROHIT SHARMA QUICK FIRE HELPS TEAM INDIA TO SET MASSIVE TARGET FOR WEST INDIES IN 4TH T20I SJN

IND vs WI 4th T20I : హిట్ మ్యాన్ ధనాధన్ బ్యాటింగ్.. రాణించిన పంత్, సామ్సన్.. విండీస్ ముందు భారీ టార్గెట్

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 4th T20I : వెస్టిండీస్ (West Indies)తో జరుగుతోన్న నాలుగో టి20లో భారత (India) క్రికెట్ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. సమష్టిగా తమ బ్యాట్ లకు పనిచెప్పడంతో శనివారం జరుగుతోన్న నాలుగో టి20లో భారత్ భారీ స్కోరును అందుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs WI 4th T20I : వెస్టిండీస్ (West Indies)తో జరుగుతోన్న నాలుగో టి20లో భారత (India) క్రికెట్ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు. సమష్టిగా తమ బ్యాట్ లకు పనిచెప్పడంతో శనివారం జరుగుతోన్న నాలుగో టి20లో భారత్ భారీ స్కోరును అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఆట ఆడాడు. చివర్లో సంజూ సామ్సన్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (8 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్ భారీ స్కోరును అందుకుంది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, అల్జారీ జోసెఫ్ లు తలా రెండు వికెట్లు తీశారు.

వర్షం వల్ల మ్యాచ్ 45 నిమిషాలు ఆలస్యంగా ఆరంభం అయ్యింది. మ్యాచ్ కు వర్ష సూచన ఉండటంతో టాస్ నెగ్గిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (24) శుభారంభం చేశారు. వీరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ తొలి వికెట్ కు53 పరుగులు జోడించారు.8 పరుగుల వ్యవధిలో ఓపెనర్ల వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ క్రమంలో జత కలిసిన దీపక్ హుడా (21), పంత్ లు జట్టును ముందుకు నడిపారు. వీరు ఆచితూచి ఆడటంతో భారత ఇన్నింగ్స్ మెరుపులు లేకుండానే సాగింది. వీరిద్దరు అవుటయ్యాక.. సంజూ సామ్సన్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో వచ్చిన అతడు అద్భుత ఆటతీరును కొనసాగించాడు. దినేశ్ కార్తీక్ (6) విఫలం అయినా.. అక్షర్ పటేల్ తో కలిసి భారత్ కు భారీ స్కోరును అందించాడు. చివర్లో అక్షర్ పటేల్ 2 సిక్సర్లతో పాటు ఒక ఫోర్ బాదాడు. దాంతో భారత్ 191 స్కోరును అందుకుంది.



తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, డ్రేక్స్, ఒడెద్ మెకాయ్,  డెవోన్ థామస్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Sanju Samson

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు