Home /News /sports /

IND W VS SLW 3RD T20 LIVE SCORE TEAM INDIA WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN

IND W vs SLW 3rd T20 : క్లీన్ స్వీపే లక్ష్యం.. మూడో టి20లో టాస్ నెగ్గిన భారత్.. తుది జట్లు ఇవే..

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SLW 3rd T20 : శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో మరికాసేపట్లో ఆరంభమయ్యే చివరిదైన మూడో టి20లో టాస్ నెగ్గిన టీమిండియా (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఇప్పటికే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
IND W vs SLW 3rd T20 : శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో మరికాసేపట్లో ఆరంభమయ్యే చివరిదైన మూడో టి20లో టాస్ నెగ్గిన టీమిండియా (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఇప్పటికే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఇక సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో మూడో టి20లో బరిలోకి దిగుతోంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఎటువంటి మార్పులు చేయలేదు. మరో వైపు సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన శ్రీలంక మహిళల జట్టు డీలా పడింది. కనీసం మూడో మ్యాచ్ లోనైనా నెగ్గి క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు రెండు మార్పులు చేసింది. హాసిని, ఉదేశికలను తప్పించిన శ్రీలంక వారి స్థానాల్లో కాంచన,  షెహానిలను తీసుకుంది.

ఇది కూడా చదవండి  : మధ్యప్రదేశ్ కోచ్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన కార్తీక్ కాకా..ఏకంగా ఆ ఫుట్ బాల్ దిగ్గజ కోచ్ తో పోలుస్తూ..

ఈ సిరీస్ లో భారత జట్టు విజయం సాధించినా కూడా బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. భారీ స్కోర్లు సాధించడంల ో విఫలం అవుతున్నారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లతో పాటు తెలుగమ్మాయి సబ్బినేని మేఘనాలకు ఆరంభాలు లభించినా భారీ స్కోర్లు చేయడంలో సక్సెస్ కావడం లేదు. హర్మన్ ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీ పాత్రకు న్యాయం చేస్తోంది. ఇక శ్రీలంక పరిస్థితి భారత జట్టు కంటే కూడా చాలా దారుణంగా తయారైంది. ఓపెనర్లు  విష్మి గుణరత్నే, కెప్టెన్ చమరి ఆటపట్టు రాణిస్తున్నా మిగతా బ్యాటర్స్ రాణించడంలేదు. రెండో టి20లో వీరిద్దరు కూడా తొలి వికెట్ కు 87 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక 125 పరుగులకే పరిమితం అయ్యింది.



తుది జట్లు

భారత మహిళల జట్టు

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాధా యాదవ్, సిమ్రాన్

శ్రీలంక మహిళల జట్టు

విష్మి, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత, కవిశ, నిలాక్షి డిసిల్వా,  కాంచన, అనుష్క, ఒషడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, షెహాని
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs srilanka, Rohit sharma, Smriti Mandhana, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు