Home /News /sports /

IND W VS SLW 3RD T20 LIVE SCORE TEAM INDIA PUT FIGHTING TOTAL FOR SRI LANKA WOMEN TEAM IN 3RD T20 SJN

IND W vs SL W : కుప్పకూలిన టీమిండియా.. శ్రీలంక ముందు ఈజీ టార్గెట్.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND W vs SL W 3rd T20 : క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత (India) మహిళల జట్టు చివరిదైన మూడో టి20లో తడబడింది. సోమవారం జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా (Team India)ను శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు బౌలర్లు దెబ్బ తీశారు.

ఇంకా చదవండి ...
IND W vs SL W 3rd T20 : క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత (India) మహిళల జట్టు చివరిదైన మూడో టి20లో తడబడింది. సోమవారం జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా (Team India)ను శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టు బౌలర్లు దెబ్బ తీశారు. స్టార్ బ్యాటర్లకు కొదవలేకున్నా భారీ స్కోరును సాధించడంలో టీ మిండియా విఫలం అయ్యింది. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 33; 3 ఫోర్లు) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో సుగందిక కుమారి, కాంచన, రణసింఘే, రణవీర తలా ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించలేదు. లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ (5) విఫలం అయ్యింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సబ్బినేని మేఘన (22).. మరో ఓపెనర్ స్మృతి మంధాన (22)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ స్లోగా ఆడటంతో భారత స్కోరు బోర్డు ముందుకు వెళ్లలేకపోయింది. వీరిద్దరూ కూడా 3 పరుగుల వ్యవధిలో ఆవుటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు మధ్య మధ్యలో ఫోర్లు కొట్టడంతో భారత్ 100 మార్కును అందుకుంది. కీలక సమయంలో జెమీమా అవుటవ్వడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. పూజా వస్త్రాకర్ (6 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండు ఫోర్లు బాదడంతో భారత్ 130 ప్లస్ స్కోరును అందుకోగలిగింది. హర్మన్ మాత్రం చివరి వరకు క్రీజులోనే ఉండి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. పిచ్ స్లోగా ఉండటం గత రెండు మ్యాచ్ ల్లోనూ శ్రీలంక 130 స్కోరును అందుకోకపోవడంతో ఈ మ్యాచ్ లోనూ భారతే గెలిచే అవకాశం ఉంది.



తుది జట్లు

భారత మహిళల జట్టు

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాధా యాదవ్, సిమ్రాన్

శ్రీలంక మహిళల జట్టు

విష్మి, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత, కవిశ, నిలాక్షి డిసిల్వా,  కాంచన, అనుష్క, ఒషడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, షెహాని
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, India vs srilanka, Rohit sharma, Smriti Mandhana, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు