Home /News /sports /

IND W VS SLW 3RD T20 LIVE SCORE SRI LANKA WOMEN TEAM BEAT INDIA WOMEN TEAM BY 7 WICKETS SJN

IND W vs SLW 3rd T20 : టీమిండియా బౌలర్లను ఉతికారేసిన శ్రీలంక కెప్టెన్.. మూడో టి20లో హర్మన్ సేనకు భారీ ఓటమి

PC : TWITTER

PC : TWITTER

IND W vs SLW 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20ల్లోనూ ఓడిన శ్రీలంక (Sri lanka) మహిళల జట్టుకు ఓదార్పు విజయం దక్కింది. భారత మహిళల జట్టుతో సోమవారం జరిగిన మూడో టి20లో లంకేయుల కెప్టెన్ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) దంచి కొట్టింది.

ఇంకా చదవండి ...
IND W vs SLW 3rd T20 : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి రెండు టి20ల్లోనూ ఓడిన శ్రీలంక (Sri lanka) మహిళల జట్టుకు ఓదార్పు విజయం దక్కింది. భారత మహిళల జట్టుతో సోమవారం జరిగిన మూడో టి20లో లంకేయుల కెప్టెన్ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 80 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) దంచి కొట్టింది. దాంతో టీమిండియా (Team India) నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి శ్రీలంక ఛేదించింది. శ్రీలంక జట్టు 17 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో భారత్ పై ఘనవిజయం సాధించింది. తద్వారా భారత్ చేతిలో వైట్ వాష్ కాకుండా శ్రీలంక జట్టు తప్పించుకుంది.

139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ లో రాణించిన విష్మి గుణరత్నే (5) ఈ మ్యాచ్ లో మాత్రం త్వరగానే అవుటైంది. అనంతరం వచ్చిన హర్షత (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. దాంతో మరోసారి శ్రీలంక తక్కువ స్కోరుకే అవుటయ్యేలా కనిపించింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన నీలాక్షి డిసిల్వా (30)తో కలిసి చమరి జట్టును ముందుకు నడిపింది. నీలాక్షి నెమ్మదిగా ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేసేందుకే ప్రయత్నించగా.. చమరి మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఫోర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడింది. చివర్లో నీలాక్షి అవుటైనా.. కవిశ (7 నాటౌట్)తో కలిసి శ్రీలంకకు వైట్ వాష్ పరాభవాన్ని తప్పించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించలేదు. లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ (5) విఫలం అయ్యింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సబ్బినేని మేఘన (22).. మరో ఓపెనర్ స్మృతి మంధాన (22)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. వీరిద్దరూ స్లోగా ఆడటంతో భారత స్కోరు బోర్డు ముందుకు వెళ్లలేకపోయింది. వీరిద్దరూ కూడా 3 పరుగుల వ్యవధిలో ఆవుటవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టారు మధ్య మధ్యలో ఫోర్లు కొట్టడంతో భారత్ 100 మార్కును అందుకుంది. కీలక సమయంలో జెమీమా అవుటవ్వడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది. పూజా వస్త్రాకర్ (6 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండు ఫోర్లు బాదడంతో భారత్ 130 ప్లస్ స్కోరును అందుకోగలిగింది. 



భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 33; 3 ఫోర్లు) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో సుగందిక కుమారి, కాంచన, రణసింఘే, రణవీర తలా ఒక వికెట్ తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, India vs england, India vs srilanka, Smriti Mandhana, Sri Lanka, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు