Home /News /sports /

IND W VS SLW 2ND T20 LIVE SCORE SRI LANKA WON THE TOSS AND ELECTED BAT FIRST SJN

IND W vs SL W 2nd T20 : శ్రీలంక జట్టులో అనుష్క.. టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SL W 2nd T20 : భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక (Sri Lanka) పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా శనివారం రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇంకా చదవండి ...
IND W vs SL W 2nd T20 : భారత మహిళల క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక (Sri Lanka) పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా శనివారం రెండో టి20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టి20లో భారత్ (India) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. మరోవైపు సొంతగడ్డపై తొలి 20లో ఓడటంతో శ్రీలంక టీం ఆత్మవిశ్వాసం కాస్త తగ్గింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని శ్రీలంక పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్ ను కూడా నెగ్గి సిరీస్ ను ఇక్కడే నెగ్గాలనే యోచనలో హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)సేన ఉంది.

ఇది కూడా చదవండి  : అభిమానుల కోరిక తీర్చిన పంత్.. ఇలా చూసి ఎన్నాళ్లైందో..

రెండో టి20 కోసం భారత్ రెండు మార్పులను చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్ లను పక్కకు పెట్టిన భారత్.. యస్తిక భాటియా, సిమ్రాన్ లను తుది జట్టులోకి తీసుకుంది. శ్రీలంక తొలి టి20లో ఓడినప్పటికీ కేవలం ఒక్క మార్పును మాత్రమే చేసింది. కాంచనను పక్కన పెట్టిన ఆ జట్టు ఆమె స్థానంలో హాసినిని తుది జట్టులోకి తీసుకుంది. ఇక తొలి టి20లో జెమీమా రోడ్రిక్స్ వల్ల భారత్ 34 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మంధాన, తెలుగమ్మాయి సబ్బినేని మేఘన దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో వీరు రాణిస్తే జట్టుకు భారీ స్కోరు దక్కడం ఖాయం. తొలి టి20లో భారత్ బ్యాటింగ్ లో రాణించకపోయినా బౌలింగ్ లో అదరగొట్టింది. ప్రత్యర్థిని 104 పరుగులకే పరిమితం చేసి విజయాన్ని అందుకోగలిగింది.



తుది జట్లు

భారత మహిళల జట్టు

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాధా యాదవ్, సిమ్రాన్

శ్రీలంక మహిళల జట్టు

విష్మి, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత, కవిశ, నిలాక్షి డిసిల్వా,  హాసిని, అనుష్క, ఒషడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, ఉదేషిక
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs srilanka, Smriti Mandhana, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు