Home /News /sports /

IND W VS SLW 2ND T20 LIVE SCORE SRI LANKA SETS 126 AS TARGET FOR TEAM INDIA IN 2ND T20I SJN

IND W vs SL W : సూపర్ బౌలింగ్ తో చెలరేగిన టీమిండియా.. భారత్ టార్గెట్ ఎంతంటే?

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SL W (PC : TWITTER)

IND W vs SL W T20 Series : శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న రెండో టి20లో భారత (India) జట్టు బౌలర్లు మెరిశారు. తొలుత శ్రీలంక ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), కెప్టెన్ చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) రెచ్చిపోయినా ఆ తర్వాత కమ్ బ్యాక్ చేసి శ్రీలంక ఆట కట్టించారు.

ఇంకా చదవండి ...
IND W vs SL W T20 Series : శ్రీలంక (Sri Lanka)తో జరుగుతోన్న రెండో టి20లో భారత (India) జట్టు బౌలర్లు మెరిశారు. తొలుత శ్రీలంక ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), కెప్టెన్ చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) రెచ్చిపోయినా ఆ తర్వాత కమ్ బ్యాక్ చేసి శ్రీలంక ఆట కట్టించారు. ఆరంభం అదిరిపోయినా ఆ తర్వాత దానిని  సద్వినియోగం చేసుకోలేకపోయిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మినహా ఇతర శ్రీలంక జట్టులో ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తీశారు.

ఇది కూడా చదవండి  : తెలుగు కుర్రాడిపై రోహిత్ శర్మ ప్రయోగం సూపర్ సక్సెస్.. పాపం వణికిపోతున్న ఆ ఓపెనర్

ఓపెనర్ల జోరు.. ఆ తర్వాత బేజారు

శ్రీలంక జట్టు తరఫున ఓపెనర్లు గుణరత్నే, చమరి ఆటపట్టు జట్టుకు శుభారంభం చేశారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు ధాటిగా పరుగులు సాధించారు. ఫలితంగా శ్రీలంక స్కోరు బోర్డు వేగంగా కదిలింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉండటంతో శ్రీలంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే పూజా వస్త్రాకర్ భారత్ కు బ్రేక్ ను అందించింది. అక్కడి నుంచి కూడా శ్రీలంక బ్యాటింగ్ గాడి తప్పింది. అదే సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో.. శ్రీలంక లైనప్ కుదేళైంది. 150 ప్లస్ స్కోరు ఖాయం అనుకున్న చోట.. చివరకు ఆ స్కోరుకు దరిదాపుల్లో కూడా రాకుండానే ఇన్నింగ్స్ ను ముగించింది. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం విశేషం. ఓపెనర్లు కాకుండా డబుల్ ఫిగర్ ను చేరింది ఎక్స్ ట్రాస్ కావడం గమనార్హం. దీనిని బట్టే తెలుస్తుంది మన బౌలర్లు డెత్ ఓవర్లలో ఏ విధంగా కమ్ బ్యాక్ చేశారో అని. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెల్చుకున్నట్లు అవుతుంది.



తుది జట్లు

భారత మహిళల జట్టు

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సబ్బినేని మేఘనా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, రాధా యాదవ్, సిమ్రాన్

శ్రీలంక మహిళల జట్టు

విష్మి, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత, కవిశ, నిలాక్షి డిసిల్వా,  హాసిని, అనుష్క, ఒషడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, ఉదేషిక
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, India vs srilanka, Rohit sharma, Smriti Mandhana, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు