Home /News /sports /

IND W VS SLW 2ND T20 LIVE SCORE INDIAN WOMEN TEAM BEAT SRI LANKA WOMEN TEAM BY 5 WICKETS SJN

IND W vs SL W T20 Series : స్మృతి మంధాన అదుర్స్.. శ్రీలంక బెదుర్స్.. రెండో టి20లో భారత్ దే విజయం

Smriti Mandhana  (PC : BCCI)

Smriti Mandhana (PC : BCCI)

IND W vs SL W T20 Series : రెండో టి20లోనూ భారత మహిళల జట్టు అదరగొట్టింది. శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరుగుతోన్న మూడో టి20లోనూ భారత్ మెరిసింది. శనివారం జరిగిన రెండో టి20లో టీమిండియా (Team India) 5 వికెట్లతో నెగ్గింది. 126 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 19.1 ఓవర్లలో  5 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి గెలుపొందింది.

ఇంకా చదవండి ...
IND W vs SL W T20 Series : రెండో టి20లోనూ భారత మహిళల జట్టు అదరగొట్టింది. శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరుగుతోన్న మూడో టి20లోనూ భారత్ మెరిసింది. శనివారం జరిగిన రెండో టి20లో టీమిండియా (Team India) 5 వికెట్లతో నెగ్గింది. 126 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. 19.1 ఓవర్లలో  5 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసి గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి టి20లో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైన స్మృతి మంధాన (Smriti Mandhana).. ఈ మ్యాచ్ లో మాత్రం అదరగొట్టింది. స్మృతి మంధాన (39; 8 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (31నాటౌట్, 2 ఫోర్లు) రాణించడంతో భారత్ మరో ఐదు బంతులు  మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి  : కోహ్లీ చేతిపై ఉన్న 11 టాటూల వెనుక ఉన్న కథలేంటో మీకు తెలుసా?

మ్యాచ్ లో మరో ఓపెనర్ షఫాలీ వర్మ (17), తెలుగు తేజం సబ్బినేని మేఘన (17; 4 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగారు. తద్వారా భారత్ విజయం వైపు ధీమాగా నడిచింది. స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, సబ్బినేని మేఘనా వెంట వెంటనే అవుటైనా.. చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించింది.



అంతకుముందు తొలుత  శ్రీలంక ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), కెప్టెన్ చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) రెచ్చిపోయినా ఆ తర్వాత కమ్ బ్యాక్ చేసి శ్రీలంక ఆట కట్టించారు. ఆరంభం అదిరిపోయినా ఆ తర్వాత దానిని  సద్వినియోగం చేసుకోలేకపోయిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మినహా ఇతర శ్రీలంక జట్టులో ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రేణుక సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఓ వికెట్ తీశారు.

శ్రీలంక జట్టు తరఫున ఓపెనర్లు గుణరత్నే, చమరి ఆటపట్టు జట్టుకు శుభారంభం చేశారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు ధాటిగా పరుగులు సాధించారు. ఫలితంగా శ్రీలంక స్కోరు బోర్డు వేగంగా కదిలింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉండటంతో శ్రీలంక భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే పూజా వస్త్రాకర్ భారత్ కు బ్రేక్ ను అందించింది. అక్కడి నుంచి కూడా శ్రీలంక బ్యాటింగ్ గాడి తప్పింది. అదే సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో.. శ్రీలంక లైనప్ కుదేళైంది. 150 ప్లస్ స్కోరు ఖాయం అనుకున్న చోట.. చివరకు ఆ స్కోరుకు దరిదాపుల్లో కూడా రాకుండానే ఇన్నింగ్స్ ను ముగించింది. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం విశేషం. ఓపెనర్లు కాకుండా డబుల్ ఫిగర్ ను చేరింది ఎక్స్ ట్రాస్ కావడం గమనార్హం. దీనిని బట్టే తెలుస్తుంది మన బౌలర్లు డెత్ ఓవర్లలో ఏ విధంగా కమ్ బ్యాక్ చేశారో అని. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెల్చుకున్నట్లు అవుతుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, India vs srilanka, Rohit sharma, Smriti Mandhana, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు