Home /News /sports /

IND W VS SL W ODI SERIES TEAM INDIA BEAT SRI LANKA WOMEN TEAM BY 6 WICKETS SJN

IND W vs SL W : ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన లేడీ యువరాజ్.. శ్రీలంకపై టీమిండియా ధనాధన్ గెలుపు

Deepti Sharma (PC : TWITTER)

Deepti Sharma (PC : TWITTER)

IND W vs SL W : శ్రీలంక (Sri Lanka)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత (India) మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. టీమిండియా (Team India) స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్ తో అదరగొట్టింది.

ఇంకా చదవండి ...
IND W vs SL W : శ్రీలంక (Sri Lanka)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత (India) మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. టీమిండియా (Team India) స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్ తో అదరగొట్టింది. దాంతో తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడుమ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా (37), నిలాక్షి డిసిల్వా (43) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రేణుక సింగ్ చెరో మూడు వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్ 2 వికెట్లు తీసింది.

ఇది కూడా చదవండి : చిరుతలా పరుగెత్తే ధోనికి మోకాళ్ల నొప్పులా.! అతడి నాటు వైద్యం ధర తెలిస్తే మీరు అవాక్కవ్వాల్సిందే?

అనంతరం ఛేదనకు దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (4), యస్తిక భాటియా (1) వెంట వెంటనే అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ (44; 3 ఫోర్లు).. ఓపెనర్ షఫాలీ వర్మ (35; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి జట్టును ఆదుకుంది. వీరిద్దరూ వికెట్లను కాపాడుకుంటూ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కీలక సమయంలో షఫాలీ వర్మ పెవిలియన్ కు చేరుకుంది. ఆ తర్వాత వచ్చిన హర్లీన్ డియోల్ (34; 2 ఫోర్లు) కూడా రాణించడంతో భారత్ లక్ష్యం వైపు కదిలింది.



అయితే వీరిద్దరూ వెంట వెంటనే పెవిలియన్ కు చేరడంతో చివర్లో ఉత్కంఠ నెలకొంది. ఓవర్లు ఉన్నా.. వికెట్లు పడుతుండటంతో భారత్ ఆలౌట్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే దీప్తి శర్మ (22 నాటౌట్) బాధ్యాతాయుత ఇన్నింగ్స్ ఆడింది. భారీ షాట్లు ఆడకుండా పరిస్థితులకు తగ్గట్లు దీప్తి శర్మ బ్యాటింగ్ చేసింది. మరో ఎండ్ లో ఉన్న పూజా వస్త్రాకర్ (21 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు సిక్సర్లు బాదడంతో మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుంది. శ్రీలంక ప్లేయర్లలో ఇనోక రణవీర 4 వికెట్లు తీసింది. రణసింఘె 2 వికెట్లు తీసింది. వీరు మినహా మిగిలిన బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు మాత్రం తీయలేకపోయారు. దాంతో భారత్ శ్రీలంకపై ఈజీ విక్టరీని అందుకుంది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన దీప్తి శర్మకు ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డు లభించింది. రెండో వన్డే ఇదే వేదికగా సోమవారం జరుగుతుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, India vs srilanka, Rohit sharma, Smriti Mandhana, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు