హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs SL W : జెమీమా అదరహో.. శ్రీలంకపై భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఎంతంటే?

IND W vs SL W : జెమీమా అదరహో.. శ్రీలంకపై భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా శ్రీలంక (Sri Lanka) జట్టుతో జరుగుతున్న ఆరంభ పోరులో భారత (India) బ్యాటర్స్ రాణించారు. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరగుతున్న ఈ ఆసియా కప్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs SL W : మహిళల ఆసియా కప్ (Asia cup) 2022లో భాగంగా శ్రీలంక (Sri Lanka) జట్టుతో జరుగుతున్న ఆరంభ పోరులో భారత (India) బ్యాటర్స్ రాణించారు. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరగుతున్న ఈ ఆసియా కప్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఆటతీరును కనబరిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్) జెమీమాకు చక్కటి సహకారం అందించింది. శ్రీలంక బౌలర్లలో రణసింఘే 3 వికెట్లు తీసింది. చివర్లో హేమలత (13 నాటౌట్), రిచా ఘోష్ (9) ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. దాంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన స్కోరునే ఉంచగలిగింది.

లేడీ సెహ్వాగ్ మరోసారి విఫలం

మహిళల క్రికెట్ జట్టులో సెహ్వాగ్ లా ఉన్న షఫాలీ వర్మ (10) తన పూర్ ఫామ్ ను కొనసాగిస్తుంది. ఓపెనర్ గా వచ్చిన ఆమె మరోసారి విఫలం అయ్యింది. ఇక ఫామ్ లో ఉన్న స్మృతి మంధాన (6) కూడా నిరాశ పరిచింది. దాంతో భారత్ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డను పరుగెత్తించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 92 పరుగులు జోడించడం విశేషం. అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన హర్మన్ ప్రీత్ కౌర్ స్టంపౌట్ అయ్యింది. కాసేపటికే అర్ధ సెంచరీ చేసిన జెమీమా కూడా పెవిలియన్ కు చేరుకుంది. చివర్లో హేమలత, రిచా ఘోష్ లు ధాటిగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 150 మార్కును అందుకుంది. ఇప్పటి వరకు ఆసియా కప్ (మహిళల) 7 సార్లు జరగ్గా. .అందులో భారత్ ఏకంగా 6 సార్లు నెగ్గింది. ఒకసారి బంగ్లాదేశ్ చాంపియన్ గా అవతరించింది. అప్పుడు భారత్ పై ఫైనల్ల ో బంగ్లాదేశ్ నెగ్గడం విశేషం.

తుది జట్లు

టీమిండియా 

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హేమలత, స్నేహ్ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుక సింగ్

శ్రీలంక

హసిని పెరీరా, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత మాదవి, అనుష్క, నిలాక్షి డిసిల్వా, కవిశ దిల్హారి, సెహని, ఒషాడి రణసింఘే, సుగందిక కుమారి, రణవీర, అచిని కులసూర్య

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bangladesh, India vs South Africa, India vs srilanka, Smriti Mandhana, Team India, Women's Asia Cup

ఉత్తమ కథలు