IND W VS SL W INDIAN WOMEN TEAM BEAT SRI LANKA WOMEN BY 10 WICKETS AND CLINCHES ODI SERIES SJN
IND W vs SL W : శ్రీలంకను చితక్కొట్టిన భారత ఓపెనర్లు.. రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ
Smriti Mandhana (PC : BCCI)
IND W vs SL W : శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్ లో భారత (India) మహిళల జట్టు అదరగొడుతుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలోనూ అద్భుత ఆటతీరుతో నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
IND W vs SL W : శ్రీలంక (Sri Lanka) మహిళల జట్టుతో జరుగుతోన్న వన్డే సిరీస్ లో భారత (India) మహిళల జట్టు అదరగొడుతుంది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలోనూ అద్భుత ఆటతీరుతో నెగ్గింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. సోమవారం పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఏకంగా 10 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగలకు ఆలౌటైంది. రేణుక సింగ్ 4 వికెట్లతో రాణించగా.. మేఘ్నాసింగ్, దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కాంచన (47; 2 ఫోర్లు) శ్రీలంక తరఫున టాప్ స్కోరర్ గా నిలువడం విశేషం.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 25.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసి గెలుపొందింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71; 4 ఫోర్లు, 1 సిక్స్) లాంఛనం పూర్తి చేశారు. శ్రీలంక బౌలింగ్ ను ఆరంభం నుంచే భారత ఓపెనర్లు చీల్చి చెండాడారు. పస లేని బౌలింగ్ పై ఎదురుదాడికి దిగిన వీరు బౌండరీల వర్షం కురిపించారు. మంధాన అయితే క్లాస్ షాట్ లతో బౌండరీలను సాధించింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ కూడా దాటిగా ఆడినప్పటికీ మంధానలాగ బౌండరీలను రాబట్టలేదు. వీరిద్దరూ తొలి వికెట్ కు 174 పరుగులు జోడించి భారత్ కు ఘన విజయాన్ని కట్టబెట్టారు.
Renuka Singh scalped 4⃣ wickets & bagged the Player of the Match award as #TeamIndia won the second #SLvIND ODI. ???? ????
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకను రేణుక సింగ్ ఓ ఆట ఆడుకుంది. ఓపెనర్లు హాసిని పెరీరా (0), విష్మీ గుణరత్నే (3)లను ఆరంభంలోనే పెవిలియన్ కు చేర్చి భారత్ కు శుభారంభం అందించింది. వీరిద్దరితో పాటు హర్షిత (0)ను కూడా అవుట్ చేసి కోలుకోనీకుండా చేసింది. అయితే కెప్టెన్ చమరి ఆటపట్టు (27), అనుష్క (25) భారత బౌలర్లను కాసేపు అడ్డుకున్నారు. అయితే వీరు భారీ స్కోర్లను సాధించలేకపోయారు. చివర్లో కాంచన పరుగులు చేయడంతో శ్రీలంక 100 మార్కును దాటింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.