Home /News /sports /

IND W VS PAK W TEAM INDIA RESTRICTED PAKISTAN WOMEN TEAM BELOW PAR SCORE IN COMMONWEALTH GAMES GROUP MATCH SJN

IND W vs PAK W : భారత్ దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్.. మరీ ఇంత దారుణమైన బ్యాటింగా.!

PC : BCCI

PC : BCCI

IND W vs PAK W : సూపర్ సండే రోజు భారత్ (India) సగం పనిని విజయవంతంగా పూర్తి చేసింది. కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ మహిళల (Pakistan) జట్టుతో భారత మహిళల జట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.

IND W vs PAK W : సూపర్ సండే రోజు భారత్ (India) సగం పనిని విజయవంతంగా పూర్తి చేసింది. కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ మహిళల (Pakistan) జట్టుతో భారత మహిళల జట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు భారత్ దెబ్బకు వణికిపోయింది. టీమిండియా (Team india) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం నానా తంటాలు పడింది. వర్షం కారణంగా మ్యాచ్ ను ఇన్నింగ్స్ కు 18 ఓవర్లకు కుదించారు. తొలుత పాకిస్తాన్ సరిగ్గా 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాణా యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. రేణుక సింగ్, మేఘ్నా సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ తీశారు. పాకిస్తాన్ తరఫున మునీబా అలీ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచింది.

టీమిండియా సూపర్ షో

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విఫలమైన హర్లీన్ డియోల్, రాజేశ్వరి గైక్వాడ్ ల స్థానాల్లో స్నేహ్ రాణా, మేఘ్నా సింగ్ లను భారత్ తుది జట్టులోకి తీసుకుంది. తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూ మేఘ్నా సింగ్ తన తొలి ఓవర్ లోనే పాకిస్తాన్ ఓపెనర్ జావెద్ (0)ను డకౌట్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బిస్మా మారూఫ్ (17)తో కలిసి మునీబా అలీ జట్టును ముందుకు నడిపింది. వీరిద్దరు టెస్టు మ్యాచ్ కంటే ఘోరంగా పరుగులు సాధించారు. దాంతో వీరి స్కోరు బోర్డు ఓవర్ కు 6 కంటే తక్కువగా ముందుకు కదిలింది. ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన స్నేహ్ రాణా ఒకే ఓవర్ లో కెప్టెన్ బిస్మాతో పాటు మునీబాను అవుట్ చేసి భారత్ కు డబుల్ బ్రేక్ ఇచ్చింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ కూడా బంతితో మెరిసింది. ఫలితంగా పాకిస్తాన్ బ్యాటింగ్ ఏ దశలోనూ ముందుకు సాగలేదు.



2 ఓవర్లు 7 పరుగలు 5 వికెట్లు

16 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 5 వికెట్లకు 92 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో పాక్ దూకుడుగా ఆడుతుందనుకంటే చాలా దారుణంగా ఆడింది. చివరి రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి మిగిలిన ఐదు వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. దాంతో పాకిస్తాన్ 100 పరుగుల మార్కును కూడా చేరుకోలేకపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు సెమీఫైనల్ కు చేరడం దాదాపు కష్టమే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India, Pv sindhu, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు