Home /News /sports /

IND W VS PAK W INDIA WOMEN VS PAKISTAN WOMEN MATCH TOSS DELAYED BY RAIN SJN

IND W vs PAK W : చిరకాల ప్రత్యర్థి పాక్ తో మ్యాచ్.. వర్షం కారణంగా వాయిదా పడ్డ టాస్.. ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

IND W vs PAK W : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మహిళల జట్ల క్రికెట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కావాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.

ఇంకా చదవండి ...
IND W vs PAK W : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మహిళల జట్ల క్రికెట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో భాగంగా మరికొద్ది సేపట్లో ఆరంభం కావాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఎడ్జ్ బాస్టన్ లో ప్రస్తుతం వాన పడుతుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటల (భారత కాలమానం ప్రకారం)కు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. చిరు జల్లులతో మొదలైన వాన అనంతరం జోరందుకుంది. ఫలితంగా పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం 4 గంటల (భారత కాలమానం ప్రకారం)లలోపు మ్యాచ్ ఆరంభం అయితే ఓవర్లలో ఎటువంటి కోత ఉండదు. ఒకవేళ 4 లోపు మ్యాచ్ ఆరంభం కాకపోతే మాత్రం ఓవర్లలో కోత ఉండే అవకాశం ఉంది.

బ్యాటింగ్ ఫర్వాలేదు.. బౌలింగే

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ అంచనాలకు మించి రాణించిందనేది వాస్తవం. అయితే కీలక సమయంలో పట్టు వదిలి ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ లో భారత్ పటిష్టంగానే ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ సాధిస్తే.. షఫాలీ వర్మ 48 పరగులతో సత్తా చాటింది. ఇక స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఉన్నంత సేపు ధాటిగా ఆడింది. అయితే యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ లు తొలి మ్యాచ్ లో విఫలం అయ్యారు. వీరు రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్ లో రేణుక సింగ్ ఏకంగా నాలుగు వికెట్లతో మెరిసింది. దీప్తి శర్మ 2 వికెట్లు సాధించింది. అయితే రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ లు దారుణంగా విఫలం అయ్యారు. వీరిద్దరే 6 ఓవర్లు వేసి 60కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో రాధా యాదవ్ పై వేటు పడే అవకాశం ఉంది. ఆమె స్థానంలో పూనమ్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇక కరోనా బారిన పడ్డ పూజా వస్త్రాకర్ కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆమె ఈ మ్యాచ్ కు దూరమైతే అది భారత్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.



ముఖాముఖి పోరులో భారత్ కే  ఆధిక్యం
 ఇరు జట్లు ఇప్పటి వరకు 11 టి20 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో భారత్ 9 సార్లు విజయం సాధించగా.. పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. ఇక మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఆరంభం కానుంది. సోనీ నెట్ వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India VS Pakistan, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు