హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs ENG W : 10 పరుగుల తేడాలో 4 వికెట్లు గోవిందా.. కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా.. మనం మారం ఇక..

IND W vs ENG W : 10 పరుగుల తేడాలో 4 వికెట్లు గోవిందా.. కీలక మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా.. మనం మారం ఇక..

PC : BCCI/Twitter

PC : BCCI/Twitter

IND W vs ENG W : భారత మహిళల (India) జట్టు రాత మారడం లేదు. పురుషుల జట్టుకు ఏ మాత్రం తీసిపోకుండా కీలక మ్యాచ్ ల్లో చేతులు ఎత్తేస్తూనే ఉంది. గత నెలలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs ENG W : భారత మహిళల (India) జట్టు రాత మారడం లేదు. పురుషుల జట్టుకు ఏ మాత్రం తీసిపోకుండా కీలక మ్యాచ్ ల్లో చేతులు ఎత్తేస్తూనే ఉంది. గత నెలలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో ఫైనల్ చేరినా.. చివరి మెట్టుపై ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టు చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ (HarmanPreet Kaur) నాయకత్వంలోని టీమిండియా (Team India) మహిళల జట్టు ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ లను ఆడుతుంది. అందులో భాగంగా జరిగిన మూడో టి20లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిల ో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముందు వరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ చెరో జట్టు విజయం సాధించింది.

ఫలితంగా సిరీస్ విజేతను మూడో టి20 మ్యాచ్ తేల్చింది. రెండో టి20లో అద్భుత విజయం సాధించడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా కనిపించింది. కానీ, బ్యాటింగ్ ఆరంభించాక టీమిండియ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలిపోయింది. షఫాలీ వర్మ (5), స్మృతి మంధాన (9), తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (0), హర్మన్ ప్రీత్ కౌర్ (5), హేమలత (0) పెవిలియన్ కు క్యూ కట్టారు. దాంతో 11/0గా ఉన్న భారత్.. కాసేపటికే 21/4గా నిలిచింది. అంటే 10 పరుగుల తేడాలో 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఒక దశలో భారత్ 100 పరుగుల మార్కును చేరుకుంటుందా అనే సందేహాలు కూడా కలిగాయి. అయితే రిచా ఘోష్ (33), పూాజా వస్త్రాకర్ (19) పోరాడటంతో భారత్  20 ఓవర్లలో  8 వికెట్లకు 122 పరుగులు చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 126 పరుగులు చేసి నెగ్గింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్ సోఫియా డంక్లీ (49) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఆమెకు అలైస్ క్యాప్సీ (38 నాటౌట్) అండగా నిలిచింది. మరో ఓపెనర్ డానీ వ్యాట్ (22) ఫర్వాలేదనిపించింది. వీరు ముగ్గురు అదరగొట్టడంతో ఇంగ్లండ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యానికి చేరుకుని మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది.

టి20 సిరీస్ ముగియడంతో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 18న (ఆదివారం) తొలి వన్డే జరగనుంది. 21న రెండో వన్డే, 24న మూడో వన్డే జరగనుంది. లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే జులన్ గోస్వామికి చివరి మ్యాచ్ కానుంది. క్రికెట్ మక్కా లార్డ్స్ లో జులన్ గోస్వామి క్రికెట్ కు వీడ్కోలు పలకనుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs australia, India vs england, India vs South Africa, KL Rahul, Rohit sharma, Smriti Mandhana, Team India, Virat kohli

ఉత్తమ కథలు