హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs ENG W : కెరీర్ లో ఫైనల్ మ్యాచ్ ఆడేస్తున్న టీమిండియా లెజెండ్.. లార్డ్స్ లో ఘనంగా వీడ్కోలు

IND W vs ENG W : కెరీర్ లో ఫైనల్ మ్యాచ్ ఆడేస్తున్న టీమిండియా లెజెండ్.. లార్డ్స్ లో ఘనంగా వీడ్కోలు

PC : BCCI/Twitter

PC : BCCI/Twitter

IND W vs ENG W : టీమిండియా (Team India) మహిళల క్రికెట్ దిగ్గజం.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) క్రికెట్ కు గుడ్ బై పలకనుంది. ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా 24న జరిగే మూడో వన్డే జులన్ గోస్వామి కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కానుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs ENG W : టీమిండియా (Team India) మహిళల క్రికెట్ దిగ్గజం.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) క్రికెట్ కు గుడ్ బై పలకనుంది. ఇంగ్లండ్ (England) మహిళల జట్టుతో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా 24న జరిగే మూడో వన్డే జులన్ గోస్వామి కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కానుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జులన్ గోస్వామి 19 ఏళ్ల 262 రోజుల సుదర్ఘ తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకనుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన జులన్ గోస్వామి.. భారత మహిళల క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. ఫాస్ట్ బౌలర్ గా జట్టులోకి అడుగుపెట్టినా.. కీలక సమయాల్లో ఆమె బ్యాట్ తోనూ రాణించి జట్టుకు విజయాలను అందించింది.

వైట్ వాష్ ను గిఫ్ట్ గా

జులన్ గోస్వామికి వైట్ వాష్ ను కానుకగా ఇచ్చేందుకు భారత్ ప్లాన్ చేసింది. మూడు మ్యచ్ ల వన్డే సిరీస్ లో ఆడిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్ నెగ్గింది. దాంతో సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక లార్డ్స్ లో కూడా గెలిస్తే ఇంగ్లండ్ ను వారి గడ్డ మీదే వైట్ వాష్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా జులన్ గోస్వామికి ఇది ప్రత్యేక బహుమతిగా కూడా మిగలనుంది. ఇక 2009లో జులన్ గోస్వామి నాయకత్వంలో హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. అయితే ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జులన్ తన కెరీర్ ను ముగించనుండటం విశేషం. 39 ఏల్ల జులన్ గోస్వామి తన కెరీర్ లో ఎన్నో రికార్డులను అందుకుంది.

ఇక బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) జులన్ గోస్వామి ఆడే చివరి మ్యాచ్ ను కోల్ కతాలోని మల్టిప్లెక్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జులన్ తన టెస్టు కెరీర్ లో 12 మ్యాచ్ ల్లో 44 వికెట్లతో పాటు 291 పరుగులు చేసింది. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. ఇక వన్డేల్లో 203 మ్యాచ్ ల్లో 253 వికెట్లు..1228 పరుగులు చేసింది.  ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉండటం విశేషం. ఇక టి20ల్లో 68 మ్యాచ్ ల్లో 56 వికెట్లు తీసింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India vs australia, India vs england, Jasprit Bumrah, KL Rahul, Mithali Raj, Rishabh Pant, Rohit sharma, Smriti Mandhana, Virat kohli

ఉత్తమ కథలు