హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs ENG W 2nd ODI : టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. క్రికెట్ కు అల్విదా ప్రకటించనున్న టీమిండియా స్టార్.. తుది జట్లు ఇవే

IND W vs ENG W 2nd ODI : టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. క్రికెట్ కు అల్విదా ప్రకటించనున్న టీమిండియా స్టార్.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

IND W vs ENG W 2nd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా క్రికెట్ మక్కా లార్డ్స్ (Lords) వేదికగా మరికాసేపట్లో భారత్ (India), ఇంగ్లండ్ (England) మహిళల జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs ENG W 2nd ODI : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా క్రికెట్ మక్కా లార్డ్స్ (Lords) వేదికగా మరికాసేపట్లో భారత్ (India), ఇంగ్లండ్ (England) మహిళల జట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు జరగ్గా ఈ రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ తో భారత వెటరన్ ప్లేయర్ జులన్ గోస్వామి (Jhulan Goswami) ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. బెల్ స్థానంలో డేవిస్ ను జట్టులోకి తీసుకుంది. భారత్ మాత్రం గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగనుంది.

టీమిండియా  మహిళల క్రికెట్ దిగ్గజం.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి  క్రికెట్ కు గుడ్ బై పలకనుంది. ఇంగ్లండ్  మహిళల జట్టుతో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా 24న జరిగే మూడో వన్డే జులన్ గోస్వామి కెరీర్ లో ఆఖరి మ్యాచ్ కానుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన జులన్ గోస్వామి 19 ఏళ్ల 262 రోజుల సుదర్ఘ తన క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలకనుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన జులన్ గోస్వామి.. భారత మహిళల క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. ఫాస్ట్ బౌలర్ గా జట్టులోకి అడుగుపెట్టినా.. కీలక సమయాల్లో ఆమె బ్యాట్ తోనూ రాణించి జట్టుకు విజయాలను అందించింది.

జులన్ గోస్వామికి వైట్ వాష్ ను కానుకగా ఇచ్చేందుకు భారత్ ప్లాన్ చేసింది. మూడు మ్యచ్ ల వన్డే సిరీస్ లో ఆడిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్ నెగ్గింది. దాంతో సిరీస్ ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక లార్డ్స్ లో కూడా గెలిస్తే ఇంగ్లండ్ ను వారి గడ్డ మీదే వైట్ వాష్ చేసినట్లు అవుతుంది. అంతేకాకుండా జులన్ గోస్వామికి ఇది ప్రత్యేక బహుమతిగా కూడా మిగలనుంది. ఇక 2009లో జులన్ గోస్వామి నాయకత్వంలో హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. అయితే ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జులన్ తన కెరీర్ ను ముగించనుండటం విశేషం. 39 ఏల్ల జులన్ గోస్వామి తన కెరీర్ లో ఎన్నో రికార్డులను అందుకుంది.

తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూాజా,హేమలత, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, జులన్ గోస్వామి

ఇంగ్లండ్

అమీ జోన్స్ (కెప్టెన్), బీమౌంట్, ల్యాంబ్, సోఫియా డంక్లీ, అలైస్ క్యాప్సీ, డాని వ్యాట్, కెంప్, సోఫీ ఎకెల్ స్టోన్, చార్లీ డీన్, కేట్ క్రాస్, డేవిస్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs australia, India vs england, Mithali Raj, Smriti Irani, Team India

ఉత్తమ కథలు