హోమ్ /వార్తలు /క్రీడలు /

Charlie Dean : భారత ప్లేయర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన ఇంగ్లండ్ క్రికెటర్.. ఏం జరిగిందంటే?

Charlie Dean : భారత ప్లేయర్ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన ఇంగ్లండ్ క్రికెటర్.. ఏం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

IND W vs ENG W 3rd ODI : ఇంగ్లండ్ మహిళల (England) జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల (India) జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND W vs ENG W 3rd ODI : ఇంగ్లండ్ మహిళల (England) జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల (India) జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. ఇంతకుముందు జరిగిన టి20 సిరీస్ ను భారత్ ఓడిపోయింది. అయితే  వన్డే సిరీస్ లో మాత్రం అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇంగ్లండ్ ను వారి గడ్డపైనే ఓడించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 45. 4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ 68 పరుగులతో అజేయంగా నిలిచింది. జట్టులో ఈమెదే టాప్ స్కోర్. ఇక ఓపెనర్ మంధాన 50 పరుగులతో రాణించింది. కేట్ క్రాస్ కు 4 వికెట్లు దక్కాయి. ఛేజింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. రేణుక సింగ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసిస్తే.. జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ లు చెరో రెండు వికెట్లతో సహకరించారు. ఫలితంగా ఇంగ్లండ్ 118 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది.

52 పరుగులు జోడిస్తే కానీ విజయం దక్కదన్న సమయంలో ఇంగ్లండ్ తీవ్రంగా ప్రతిఘటించింది. 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన చార్లీ డీన్ (47) వీరోచిత పోరాటం చేసింది. డేవిస్ (10)తో కలిసి జట్టును దాదాపుగా గెలిపించే పని చేసింది. అయితే తెలివిగా ఆలోచించిన దీప్తి శర్మ చార్లీ డీన్ ను మన్కడింగ్ (రనౌట్) ద్వారా అవుట్ చేసింది. 44వ ఓవర్ వేయడానికి దీప్తి శర్మ రాగా.. మూడో బంతిని వేయడానికి సిద్ధమైంది. స్ట్రయికింగ్ ఎండ్ లో డేవిస్ ఉండగా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో చార్లీ డీన్ ఉంది. బంతిని వేయడాని కంటే ముందు చార్లీ డీన్ క్రీజును దాటడంతో బౌలింగ్ వేయకుండా వికెట్లను గిరాటేసి రనౌట్ చేసింది. టీవీ అంపైర్ కూడా అవుట్ ప్రకటించాడు. దాంతో గెలిచే స్థితిలో మన్కడింగ్ ద్వారా రనౌట్ అయిన విషయాన్ని తట్టుకోలేకపోయిన డీన్ గ్రౌండ్ లోనే వెక్కి వెక్కి ఏడ్చింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs australia, India vs england, Mithali Raj, Rohit sharma, Smriti Mandhana, Virat kohli

ఉత్తమ కథలు