సొంతగడ్డపై ఆస్ట్రేలియా మహిళల (Australia Women) జట్టుతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ (Indian Women Team) భారీ ఓటమితో ఆరంభించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(57 బంతుల్లో 16 ఫోర్లతో 89 నాటౌట్), తహిలా మెక్ గ్రాత్ (29 బంతుల్లో 40 పరుగులు నాటౌట్ ; 4 ఫోర్లు, 1 సిక్సర్), హీలీ (23 బంతుల్లో 37 పరుగులు ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో.. టీమిండియాకు ఓటమి తప్పలేదు. వీరి ధాటికి 173 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది ఆస్ట్రేలియా. ఏపీకి చెందిన లెఫ్టామ్ పేసర్ అంజలి శర్వాణి (4-0-27-0) అరంగేట్రంలో ఫర్వాలేదనిపించింది. దేవికా వైద్యకు ఒక వికెట్ దక్కింది. అయితే, ఈ మ్యాచులో ఫీల్డింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. బెత్ మూనీ, తహిలా మెక్ గ్రాత్ క్యాచులు మిస్ చేయడమే కాకుండా.. ఫీల్డింగ్ తప్పిదాలతో పరుగులు సమర్పించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. భారత టాపార్డర్ బ్యాటర్లు ఫెఫాలీ వర్మ(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 21), స్మృతి మంధానా(22 బంతుల్లో 5 ఫోర్లతో 28), జెమీమా రోడ్రిగ్స్(0) విఫలమైనా.. ఫినిషింగ్ బ్యాటర్ల దీప్తి శర్మ(15 బంతుల్లో 8 ఫోర్లతో 36), రిచా ఘోష్(20 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 36) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగారు. దీంతో.. భారత్ ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ రెండు వికెట్లు తీయగా.. గార్డెనర్, సదర్లాండ్, కిమ్ గెరోత్ తలో వికెట్ తీసారు.
Australia win the first #INDvAUS T20I.#TeamIndia will look to bounce back in the second match of the series. ???? ???? Scorecard ???? https://t.co/bJbnxaQzAr pic.twitter.com/ZsIyNiHmNh
— BCCI Women (@BCCIWomen) December 9, 2022
ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బెత్ మూనీ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అలిస్సా హీలీ(37), తహిలా మెక్‌గ్రాత్(40 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో దేవికా వైద్య ఒక వికెట్ తీయగా... మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బౌలింగ్ వైఫల్యంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బ్యాటర్ల ధాటికి బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. ఏ దశలోనూ టీమిండియా ఆస్ట్రేలియా మీద పై చేయి సాధించలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
ఆకట్టుకున్న తెలుగమ్మాయి..
ఈ మ్యాచ్‌తో తెలుగు అమ్మాయి అంజలి శర్వాణీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఆదోనికి చెందిన అంజలి శర్వాణీ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి ప్లేయర్‌గా ఎదిగింది. అంజలి తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కాగా.. తల్లి గృహిణి. స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో అంజలి పదోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఆమెకున్న ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు.. ఆ రంగంలో ప్రోత్సహించారు. దీంతో క్రికెట్ వైపు అడుగులు వేసిన అంజలి.. అంచలంచెలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికైంది. ఆమె ఎంపిక పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs australia, Smriti Mandhana, Women's Cricket