వచ్చే ఏడాది సౌతాఫ్రికా (South Africa) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. దీనికి సన్నాహకాలను టీమిండియా (Team India) మొదలుపెట్టేసింది. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో చాంపియన్ గా నిలిచిన నెల రోజుల విరామం అనంతరం టీమిండియా మళ్లీ బరిలోకి దిగింది. ప్రస్తుతం స్వదేశంలో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతుంది. తొలి టి20లో ఓడిన భారత్.. రెండో టి20లో సూపర్ ఓవర్ లో నెగ్గింది. ఇక మూడో టి20లో మరోసారి ఆస్ట్రేలియా చేతిలో చిత్తయ్యింది.
ఈ క్రమంలో సిరీస్ లో ఉండాలంటే నాలుగో టి20లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. నాలుగో టీ20 బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక, భారత జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. రాజేశ్వరి గైక్వాడ్ స్థానంలో హార్లీన్ డియోల్ తుది జట్టులోకి వచ్చింది. ఆస్ట్రేలియా కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. నికోల్ కేరీ స్థానంలో హీథర్ గ్రాహమ్ తుది జట్టులో స్థానం సంపాదించింది.
???? Team News ???? One change for #TeamIndia as @imharleenDeol is named in the side ???? Follow the match ???? https://t.co/kG4AnIrGlR A look at our Playing XI ???? #INDvAUS pic.twitter.com/XqgNDqon7r
— BCCI Women (@BCCIWomen) December 17, 2022
ఇక ఈ సిరీస్ లో భారత్ ను ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బౌలింగ్. రేణుక సింగ్ మినహా మిగిలిన బౌలర్లు దారుణంగా విఫలం అవుతున్నారు. ప్రతి మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియా 170కి పైగా పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ లో కూడా నిలకడ లేదు. రెండో టి20 లో రెచ్చిపోయిన స్మృతి మంధాన మూడో టి20లో విఫలం అయ్యింది. జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఓపెనర్ గా ఆరంభంలో షపాలీ వర్మ మెరుపులు మెరిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్ ను ఆడటంలో సక్సెస్ కాలేకపోతుంది.
ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ భారీ షాట్లు ఆడుతుండటం ఊరటనిచ్చే అంశం. అయితే దీప్తి శర్మ మూడో టి20లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో నిరాశ పరిచింది. సిరీస్ ను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో రాణించాల్సి ఉంది. లేదంటే సిరీస్ ఇక్కడే కోల్పోయే అవకాశం ఉంది.
ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ అదరగొట్టారు. సూపర్ ఓవర్ లో ఓడిన రెండో టి20లో కూడా వారు కమ్ బ్యాక్ చేసిన విధానం అద్బుతం. స్టార్ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ ఫామ్ లోకి రావడం ఆసీస్ జట్టుకు సానుకూల అంశం. ఈ క్రమంలో నాలుగో టి20లో నెగ్గి సిరీస్ ను ఇక్కడే పట్టేయాలనే పట్టుదల మీద ఆస్ట్రేలియా ఉంది.
తుది జట్లు :
టీమిండియా : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దేవిక వైద్య, దీప్తి శర్మ, హార్లిన్ డియోల్, రాధా యాదవ్, అంజలి శ్రావణి, రేణుక సింగ్
ఆస్ట్రేలియా : బెత్ మూనీ, అలీసా హేలీ (కెప్టెన్), తహిలా మెక్ గ్రాత్, అనబెల్ సథర్లాండ్, అలాన కింగ్, యాష్లే గార్డ్ నర్, ఎలీస్ పెర్రీ, గ్రేస్ హారీస్, మెగాన్ ష్కుట్, హీథర్ గ్రాహం, డార్సీ బ్రౌన్,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND vs AUS, India vs australia, Smriti Mandhana, Women's Cricket