హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs AUS W 3rd T20 : కీలక మ్యాచులో చేతులేత్తేసిన భారత అమ్మాయిలు.. ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ..

IND W vs AUS W 3rd T20 : కీలక మ్యాచులో చేతులేత్తేసిన భారత అమ్మాయిలు.. ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ..

PC : Twitter

PC : Twitter

IND W vs AUS W 3rd T20: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక మూడో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక మూడో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. దీంతో.. టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. షెఫాలీ వర్మ (41 బంతుల్లో52 పరుగులు ; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 37 పరుగులు ; 6 పోర్లు) రాణించారు. ఆఖర్లో దీప్తి శర్మ (17 బంతుల్లో 25 పరుగులు నాటౌట్ ; 3 పోర్లు) మెరుపులు మెరిపించినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్, యాష్లే గార్డనర్ చెరో రెండు వికెట్లతో టీమిండియా జోరుకు బ్రేకులు వేశారు. ఈ ఓటమితో టీమిండియా ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో 2-1తో వెనుకంజలో ఉంది.

173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచులో స్టార్ గా నిలిచిన స్మృతి మంధాన ఈ మ్యాచులో తేలిపోయింది. 10 బంతుల్లో కేవలం ఒక పరుగు చేసి డార్సీ బ్రౌన్ బౌలింగ్ లో ఔటైంది. దీంతో.. 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత వచ్చినజెమీమా.. క్లాసీ షాట్లతో అలరించిన.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. 11 బంతుల్లో 16 పరుగులు చేసి.. డార్సీ బ్రౌన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగింది. దీంతో.. 33 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. అయితే, మూడో వికెట్ కు షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లు 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ క్రమంలో షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే నికోలా కెరీ బౌలింగ్ లో ఔటైంది. 41 బంతుల్లో 52 పరుగులు చేసింది షెఫాలీ. అయితే, షెఫాలీ ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా ఔటైంది. దేవికా వైద్యా (1), రిచా ఘోష్ (1), హర్మన్ ప్రీత్ కౌర్ (37) వెంటనే వెంటనే ఔటవ్వడంతో టీమిండియా 123 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో.. ఆఖర్లో చేయాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఆఖర్లో దీప్తి శర్మ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది.

అంతకముందు ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు భారత బౌలర్లు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు ఆస్ట్రేలియా అమ్మాయిలు. ఎలీస్ పెర్రీ (47 బంతుల్లో 75 పరుగులు ; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడుగా గ్రేస్ హారిస్ (18 బంతుల్లో 41 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెత్ మూనీ (22 బంతుల్లో 30 పరుగులు ; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, తెలుగమ్మాయి అంజలి శర్వాణీ, దేవికా వైద్యా, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.

First published:

Tags: Cricket, India vs australia, Smriti Mandhana, Women's Cricket

ఉత్తమ కథలు