ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలక మూడో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు భారత బౌలర్లు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు ఆస్ట్రేలియా అమ్మాయిలు. ఎలీస్ పెర్రీ (47 బంతుల్లో 75 పరుగులు ; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమెకు తోడుగా గ్రేస్ హారిస్ (18 బంతుల్లో 41 పరుగులు ; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెత్ మూనీ (22 బంతుల్లో 30 పరుగులు ; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, తెలుగమ్మాయి అంజలి శర్వాణీ, దేవికా వైద్యా, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ కెప్టెన్ హీలీ (1), తహిలా మెక్ గ్రాత్ (1)లు నిరాశపర్చారు. అయితే, కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ వెటరన్ బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ ఆదుకుంది. వచ్చి రావడంతో ఈ బ్యాటర్ మెరుపులు మెరిపించింది.
Innings Break! 2⃣ wickets each for Renuka Thakur, Devika Vaidya, Anjali Sarvani & Deepti Sharma ???? ???? Over to our batters now! ???????? Scorecard ▶️ https://t.co/jH1N1O1cyE #TeamIndia | #INDvAUS pic.twitter.com/Q21RHHuxiu
— BCCI Women (@BCCIWomen) December 14, 2022
వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లతో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. బెత్ మూనీ, హారీస్ లతో కలిసి కీలక భాగస్వామ్యాల్ని నిర్మించింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో భారత బౌలర్లు ఫర్వాలేదన్పించారు. దీంతో.. ఆస్ట్రేలియా 172 పరుగులకే పరిమితమైంది. లేకపోతే.. మరో పది నుంచి 20 పరుగులు అదనంగా వచ్చేవి.
ఇక, ఈ మ్యాచులో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. మేఘ్నా సింగ్ స్థానంలో రాజేశ్వరి గైక్వాడ్ తుది జట్టులో చోటు దక్కించుకుంది. ఇక, ఆస్ట్రేలియా అమ్మాయిలు రెండు మార్పులతో బరిలోకి దిగారు. కిమ్ గ్రెత్, ష్కుట్ స్థానంలో నికోల్ కేరీ, డార్సీ బ్రౌన్ తుది జట్టులోకి వచ్చారు. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్, హర్మన్ ప్రీత్ కౌర్ రాణిస్తే టీమిండియాకు కష్టాలు తీరినట్టే. స్మృతి మంధాన, షెఫాలీ, రిచా ఘోష్ మంచి టచ్ లోనే ఉన్నారు. హర్మన్ ప్రీత్ దూకుడుగా ఆడటం లేదు. జెమీమా రోడ్రిగ్స్ రెండు మ్యాచుల్లోనూ విఫలమైంది. దీంతో.. జెమీమా ఈ మ్యాచులోనైనా సత్తా చాటాలని భావిస్తుంది. సిరీస్ లో ఆధిక్యం సంపాదించడానికి ఈ మ్యాచ్ కీలకం.
తుది జట్లు
భారత్
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దేవిక వైద్య , రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శ్రావణి, రేణుక సింగ్, రాజేశ్వరి గైక్వాడ్
ఆస్ట్రేలియా
బెత్ మూనీ, అలీసా హేలీ (కెప్టెన్), తహిలా మెక్ గ్రాత్, అనబెల్ సథర్లాండ్, అలాన కింగ్, యాష్లే గార్డ్ నర్, ఎలీస్ పెర్రీ, మెగాన్ ష్కుట్, హీథర్ గ్రాహం, నికోలా కేరీ, డార్సీ బ్రౌన్,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India vs australia, Smriti Mandhana, Team India, Women's Cricket