హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ZIM : గాయంతో వాషింగ్టన్ సుందర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆర్సీబీ ఆల్ రౌండర్

IND vs ZIM : గాయంతో వాషింగ్టన్ సుందర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆర్సీబీ ఆల్ రౌండర్

PC : TWITTER

PC : TWITTER

IND vs ZIM : ఈ నెల 18 నుంచి జింబాబ్వే (Zimbabwe)తో భారత్ (India) మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. హరారే (Harare) వేదికగా జరిగే ఈ వన్డే సిరీస్ కేవలం 6 రోజుల వ్యవధిలో ముగియనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IND vs ZIM : ఈ నెల 18 నుంచి జింబాబ్వే (Zimbabwe)తో భారత్ (India) మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. హరారే (Harare) వేదికగా జరిగే ఈ వన్డే సిరీస్ కేవలం 6 రోజుల వ్యవధిలో ముగియనుంది. 18న తొలి వన్డే జరగనుండగా.. 20, 22వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. ఆసియా కప్ (Asia Cup) 2022కి ముందు ఈ టోర్నీ జరుగుతుండగా.. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli), రిషభ్ పంత్ (Rishabh Pant) లాంటి సీనియర్లు ఈ సిరీస్ లో ఆడటం లేదు. ఆసియా కప్ కు ఎంపికై ఈ సిరీస్ కు ఎంపికైన వారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో జట్టు సారథి కేఎల్ రాహుల్ (KL Rahul), దీపక్ హుడా (Deepak Hooda).. స్టాండ్ బై ప్లేయర్ అక్షర్ పటేల్ మాాత్రమే ఉన్నారు.

ఇక ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న కౌంటీ క్రికెట్ టోర్నమెంట్ రాయల్ లండన్ వన్డే కప్ లో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ కు దూరమయ్యాడు. అతడి గాయం తీవ్రమైంది కావడంతో.. అతడు ఇండియాకు తిరుగుముఖం పట్టాడు. తాజాగా అతడి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన షాబాద్ అహ్మద్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది.

ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున షాబాద్ అహ్మద్ ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున 29 మ్యాచ్‌ల్లో 118 స్ట్రయిక్‌ రేట్‌తో 279 పరుగులు చేశాడు. అంతేకాకుండా 8.58 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది అయితే మంచి ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్ ల్లో 219 పరుగులు చేయడమే కాకుండా 4 వికెట్లు తీశాడు. షాబాజ్‌కు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో మంచి రికార్డే ఉంది. బ్యాటింగ్‌లో 3 శతకాలు, 10 అర్ధశతకాలు.. బౌలింగ్‌లో 7/57 అత్యుత్తమ ప్రదర్శనతో 100కు పైగా వికెట్లు సాధించాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. అయితే వన్డే సిరీస్ కోసం ఇతడిని ఎంపిక చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ గాయపడ్డంతో షాబాజ్ కు లక్కీ ఛాన్స్ దక్కింది.

First published:

Tags: KL Rahul, Mohammed Siraj, RCB, Royal Challengers Bangalore, Sanju Samson, Shikhar Dhawan, Team India

ఉత్తమ కథలు