Home /News /sports /

IND VS ZIM ODI SERIES INDIAN CRICKET TEAM LANDED AT HARARE AIRPORT FOR ODI SERIES GAINST ZIMBABWE SJN

IND vs ZIM ODI Series : జింబాబ్వేలో సేఫ్ గా ల్యాండ్ అయిన టీమిండియా.. తొలి వన్డే ఎప్పుడంటే?

PC : Zimbabwe Cricket

PC : Zimbabwe Cricket

IND vs ZIM ODI Series : సిరీస్ ల మీద సిరీస్ లతో టీమిండియా (Team India)ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. వెస్టిండీస్ (West Indies) పర్యటన ముగించుకున్న భారత్.. వారం రోజుల వ్యవధిలో మరో వన్డే సిరీస్ కు సిద్ధమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs ZIM ODI Series : సిరీస్ ల మీద సిరీస్ లతో టీమిండియా (Team India)ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. వెస్టిండీస్ (West Indies) పర్యటన ముగించుకున్న భారత్.. వారం రోజుల వ్యవధిలో మరో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. జింబాబ్వే (Zimbabwe)తో భారత్ వారి దేశంలో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో భారత్ ఆదివారం అక్కడ ల్యాండ్ అయ్యింది. హరారే ఎయిర్ పోర్ట్ లో భారత జట్టు సేఫ్ గా దిగినట్లు జింబాబ్వే క్రికెట్ ట్వీట్ ద్వారా పేర్కొంది. అంతేకాకుండా ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. అందులో శుబ్ మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్ లతో పాటు ఇతర ప్లేయర్లు ఉండటం చూడోచ్చు.

ఇది కూడా చదవండి : స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా పాంటింగ్? షమీ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు!

ప్రధాన ప్లేయర్లు లేకుండానే

ఈ సిరీస్ లో భారత్ ప్రధాన ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుండటంతో భారత్ తన సీనియర్ ప్లేయర్లకు జింబాబ్వే సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించింది. తొలుత శిఖర్ ధావన్ ను జింబాబ్వే పర్యటనకు కెప్టెన్ గా భావించినప్పటికీ.. కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ సాధించడంతో అతడిని చివరి నిమిషంలో జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా అతడికి కెప్టెన్సీని అప్పజెప్పింది. ధావన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సిరీస్ ఈ నెల 18న జరిగే తొలి వన్డేతో ఆరంభం కానుంది. అనంతరం 20, 22న మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 లకు ఆరంభం కానున్నాయి. వీటిని సోనీ నెట్ వర్క్ ప్రత్యక్షప్రసారం చేస్తుంది.




ఇరు జట్లు


టీమిండియా

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షరు పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

జింబాబ్వే

రెగిస్ చకబ్వా (కెప్టెన్), తనకా చివాంగా, బ్రాడ్లీ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ర్యాన్ బర్ల్, ఇన్నోసెంట్ కైయా, కైటానో టకుడ్జ్వానాషే, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, తాడివానాషే మారుమణి, జాన్ మసారా, టోనీ మున్యోంగా, రిచర్డ్‌టర్ న్గార్వా, రిచర్డ్‌టోర్ న్గార్వా , మిల్టన్ శుంబా, డోనాల్డ్ తిరిపానో, సికిందర్ రాజా
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, Team India

తదుపరి వార్తలు