IND vs WI : క్రికెట్ నుంచి మరో ఇద్దరు ప్లేయర్లు తప్పుకున్నారు. సోమవారం ఊహించని విధంగా ఇంగ్లండ్ (England) టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి వెస్టిండీస్ (West Indies) ప్లేయర్లు లెండిల్ సిమన్స్ (lendl simmons), దినేశ్ రామ్ దిన్ (Denesh Ramdin)లు కూడా చేరారు. వీరిద్దరూ రోజు వ్యవధిలో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల లెండిల్ సిమన్స్ సోమవారం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. దానికంటే ఒక రోజు ముందు రామ్ దిన్ కూడా తన రిటైర్మెంట్ ను అనౌన్స్ చేశాడు. రామ్ దిన్ వెస్టిండీస్ కు సారథిగా కూడా వ్యవహరించాడు. రామ్ దిన్ తన చివరి మ్యాచ్ ను 2019లో ఆడగా.. లెండిల్ సిమన్స్ 2021లో జరిగిన టి20 ప్రపంచకప్ లో చివరి సారిగా వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. సిమన్స్ టి20ల్లో స్పెషలిస్టు బ్యాటర్ గా విండీస్ కు ఆడాడు.
ఇది కూడా చదవండి : ధోని నమ్మితే ఏ ప్లేయర్ రాత అయినా సరే మారాల్సిందే.. అందుకు ఈ ప్లేయరే ఉదాహరణ
2006లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సిమన్స్.. వన్డే, టెస్టు ల్లో కంటే కూడా టి20ల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్ లలో చాంపియన్ గా నిలిచిన విండీస్ జట్టులో సిమన్స్ సభ్యుడిగా ఉన్నాడు. 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్‌పై 82 పరుగులతో సిమన్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 144 మ్యాచ్‌లు ఆడిన సిమన్స్.. 3763 పరుగులు సాధించాడు. ఇక విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సిమన్స్ పలు ప్రాంఛైజీ టోర్నీల్లో కూడా ఆడాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2015 సీజన్లో 540 పరుగులతో ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
View this post on Instagram
View this post on Instagram
2005లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన దినేష్ రామ్ దిన్ .. 14 ఏళ్ల పాటు విండీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక రామ్‌దిన్ చివరగా టెస్టుల్లో 2019లో ఆడగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 2016లో చివరగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్ లలో చాంపియన్ గా నిలిచిన విండీస్ జట్టులో రామ్ దిన్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో రామ్ దిన్ 74 టెస్టులు, 139 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. "అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. గత 14 ఏళ్లగా విండీస్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతగా నిలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్టిండీస్ క్రికెట్, అభిమానులకు ధన్యవాదాలు అంటూ రామ్‌దిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India Vs Westindies, Rohit sharma, Shikhar Dhawan, Shreyas Iyer, Team India, Virat kohli, West Indies