హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs WI : భారత్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జట్టను ప్రకటించిన వెస్టిండీస్.. ఆ స్టార్ ఆల్ రౌండర్ పునరాగమనం

IND vs WI : భారత్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం జట్టను ప్రకటించిన వెస్టిండీస్.. ఆ స్టార్ ఆల్ రౌండర్ పునరాగమనం

నికోల‌స్ పూరన్‌, రోహిత్ శ‌ర్మ (ఫైల్ ఫోటో)

నికోల‌స్ పూరన్‌, రోహిత్ శ‌ర్మ (ఫైల్ ఫోటో)

IND vs WI : ఈ నెల 22 నుంచి భారత్ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (West indies cricket Board) తమ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడా స్ట్రాంగ్ లైనప్ ను ఎంపిక చేసింది. ఈ టీంకు నికోలస్ పూరన్ (Nicholas Pooran) సారథిగా  వ్యవహరించనున్నాడు.

ఇంకా చదవండి ...

IND vs WI : ఈ నెల 22 నుంచి భారత్ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (West indies cricket Board) తమ జట్టును ప్రకటించింది. 13 మందితో కూడా స్ట్రాంగ్ లైనప్ ను ఎంపిక చేసింది. ఈ టీంకు నికోలస్ పూరన్ (Nicholas Pooran) సారథిగా  వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా షై హోప్ (Shai hope) ఉంటాడు. ఇక ఇటీవలె బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ కు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ (Jason Holder) మళ్లీ టీంలోకి పునరాగమనం చేశాడు. స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డేలో పోరులో విండీస్ జట్టు వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. దాంతో భారత్ తో జరిగే సిరీస్ లో అయినా రాణించాలనే పట్టుదల మీద వెస్టిండీస్ జట్టు ఉంది.

ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ పాలిట అసలైన విలన్ ఇతడే.. మూడు చెరువుల నీళ్లు తాగించేశాడుగా!

ఇక విండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ లాంటి స్టార్ ప్లేయర్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఫామ్ లో లేని శిఖర్ ధావన్  భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ అనంతరం భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది. అందులో మాత్రం రోహిత్, హార్దిక్, పంత్ లు ఆడనున్నారు. అయితే కోహ్లీ మాత్రం విండీస్ పర్యటన మొత్తానికే దూరం అయ్యాడు.

షెడ్యూల్ ఇదే

వన్డేలు

జూలై 22న : తొలి వన్డే

జూలై 24న  :  రెండో వన్డే

జూలై 27న  :  మూడో వన్డే

టి20లు

జూలై 29  :  తొలి టి20

ఆగస్టు 1  :  రెండో టి20

ఆగస్టు 2  : మూడో టి20

ఆగస్టు 6  :  నాలుగో టి20

ఆగస్టు 7  :  ఐదో టి20

ఇరు జట్ల వివరాలు

వెస్టిండీస్ 

నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్తీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మాన్ పావెల్, జేడెన్ సీల్స్

ఇండియా

శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్

భారత టి20 జట్టు 

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవుశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్ దీప్ సింగ్

First published:

Tags: Dinesh Karthik, India Vs Westindies, Mohammed Siraj, Rohit sharma, Shikhar Dhawan, Virat kohli, West Indies

ఉత్తమ కథలు