Home /News /sports /

IND VS WI ODI SERIES WEST INDIES CAPTAIN NICHOLAS POORAN TAKES STUNNING CATCH OF SHREYAS IYER SJN

IND vs WI ODI Series : బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతిని ఒంటి చేత్తో పట్టేసిన సన్ రైజర్స్ ప్లేయర్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI ODI Series : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team india) 3 పరుగుల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో వెస్టిండీస్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ వేసిన మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇంకా చదవండి ...
IND vs WI ODI Series : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team india) 3 పరుగుల తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో వెస్టిండీస్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ వేసిన మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో 3 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. అయితే దూకుడు మీదున్న శ్రేయస్ అయ్యర్ ను కళ్లు చెదిరే క్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ పెవిలియన్ కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : టీమిండియా గెలుపుకు ముఖ్య కారణం అతడే.. డైవ్ చేసి ఉండకపోయింటే అంతే సంగతులు..

36వ ఓవర్ వేయడానికి మోతీ బౌలింగ్ కు వచ్చాడు. దూకుడు మీదున్న శ్రేయస్ అయ్యర్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ఐదో బంతిని వేయగా.. కవర్స్ మీదుగా శ్రేయస్ సూపర్ షాట్ ఆడాడు. బంతి బుల్లెట్ లా బౌండరీ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న నికోలస్ పూరన్ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. బుల్లెట్ లా దూసుకెళ్లిన బంతిని నేర్పుగా క్యాచ్ పట్టిన పూరన్ ను ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి మరీ..



308 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (54; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు బాదారు. బ్రూక్స్ (46) రాణించాడు. చివర్లో షెపర్డ్ (39), అకీల్ హొసీన్ (32) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడారు. భారత బౌలర్లలో సిరాజ్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్ తలా రెండు వికెట్లు తీశారు. రెండో వన్డే ఆదివారం జరగనుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.

తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో శతకాన్ని చేజర్చాకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన గబ్బర్ విండీస్ తో జరిగిన తొలి వన్డేలో తొడగొట్టాడు. శిఖర్ ధావన్ తో పాటు శుబ్ మన్ గిల్ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించాడు. విండీస్ బౌలర్లలో మోతీ రెండు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India Vs Westindies, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, SRH, Sunrisers Hyderabad, Team India

తదుపరి వార్తలు