Home /News /sports /

IND VS WI 5TH T20I TEAM INDIA BEAT WEST INDIES BY 88 RUNS IN 5TH AND LAST T20I AND CLINCHES THE SERIES BY 4 1 SJN

IND vs WI 5th T20I : చివరి టి20లో విండీస్ ను తిప్పేసిన భారత స్పిన్నర్లు.. వీరి దెబ్బకు పెవిలియన్ కు క్యూ కట్టిన వెస్టిండీస్ బ్యాటర్స్

PC : ICC

PC : ICC

IND vs WI 5th T20I : వెస్టిండీస్ (West Indies)తో ముగిసిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ ను గెలవడంతో చివరిదైన ఐదో టి20లో భారత్ కీలక ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), రిషభ్ పంత్ (Rishabh Pant), సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav)లకు విశ్రాంతి ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs WI 5th T20I : వెస్టిండీస్ (West Indies)తో ముగిసిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ ను గెలవడంతో చివరిదైన ఐదో టి20లో భారత్ కీలక ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), రిషభ్ పంత్ (Rishabh Pant), సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav)లకు విశ్రాంతి ఇచ్చింది. అయినప్పటికీ భారత్ ఐదో టి20లో 88 పరుగుల తేడాతో విండీస్ పై ఘనవిజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో సొంతం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ 15.4 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు చెరో మూడు వికెట్ల సాధించారు. విండీస్ తరఫున షిమ్రన్ హెట్ మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు ) మాత్రమే అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ ను అక్షర్ పటేల్ హడలెత్తించాడు. ఓపెనర్ గా వచ్చిన జేసన్ హోల్డర్ (0)తో పాటు బ్రూక్స్ (13), డెవోన్ థామస్ (10) వికెట్లను తీశాడు. నికోలస్ పూరన్ (3), డ్రేక్స్ (1), ఒడియన్ స్మిత్ (0)లను కుల్దీప్ యాదవ్ బలిగొన్నాడు. ఇక మిగిలిన నాలుగు వికెట్లను రవి బిష్ణోయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. హెట్ మైర్ ఆడకపోతే విండీస్ 50లోపే ఆలౌటై ఉండేది.





ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ వెస్టిండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (Rohit sharma), సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav)లకు విశ్రాంతి కల్పించడంతో.. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ (11), శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓపెనర్లుగా వచ్చారు. ఇషాన్ కిషన్ విఫలమైనా శ్రేయస్ అయ్యర్ సూపర్ షోతో అదరగొట్టాడు. అతడికి దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. దాంతో భారత్ చివరి టి20లో ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచగలిగింది.

చావో రేవో మ్యాచ్ లో రాణించిన శ్రేయస్

శ్రేయస్ అయ్యర్ కు వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఆసియా కప్, టి20 ప్రపంచకప్ ఆడాలంటే అతడు తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. తొలి మూడు మ్యాచ్ ల్లోనూ శ్రేయస్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో నాలుగో టి20లో శ్రేయస్ కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్, సూర్యకుమార్, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్ లకు విశ్రాంతి కల్పించడంతో తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ ను శ్రేయస్ అయ్యర్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు సూపర్ బ్యాటింగ్ తో చెలరేగాడు. ఇషాన్ కిషన్ విఫలమైనా దీపక్ హుడాతో కలిసి రెండో వికెట్ కు కీలకమైన 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రేయస్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Rohit sharma, Sanju Samson, Shreyas Iyer, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు