Home /News /sports /

IND VS WI 5TH T20 TEAM INDIA PUT MASSIVE TARGET FOR WEST INDIES IN FINAL T20I SJN

IND vs WI 5th T20 : విండీస్ బౌలర్లను ఊచకోత కోసిన శ్రేయస్ అయ్యర్.. చివరి టి20లో విండీస్ టార్గెట్ ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs WI 5th T20 : వెస్టిండీస్ (West Indies)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్  (India) మరో టి20 మిగిలి ఉండగానే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చివరిదైన ఐదో టి20లో భారత్ ప్రయోగాల బాట పట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs WI 5th T20 : వెస్టిండీస్ (West Indies)తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్  (India) మరో టి20 మిగిలి ఉండగానే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చివరిదైన ఐదో టి20లో భారత్ ప్రయోగాల బాట పట్టింది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ వెస్టిండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (Rohit sharma), సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav)లకు విశ్రాంతి కల్పించడంతో.. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ (11), శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓపెనర్లుగా వచ్చారు. ఇషాన్ కిషన్ విఫలమైనా శ్రేయస్ అయ్యర్ సూపర్ షోతో అదరగొట్టాడు. అతడికి దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. దాంతో భారత్ చివరి టి20లో ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచగలిగింది.

చావో రేవో మ్యాచ్ లో చెలరేగిన శ్రేయస్

శ్రేయస్ అయ్యర్ కు వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ఆసియా కప్, టి20 ప్రపంచకప్ ఆడాలంటే అతడు తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. తొలి మూడు మ్యాచ్ ల్లోనూ శ్రేయస్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో నాలుగో టి20లో శ్రేయస్ కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్, సూర్యకుమార్, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్ లకు విశ్రాంతి కల్పించడంతో తుది జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ ను శ్రేయస్ అయ్యర్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు సూపర్ బ్యాటింగ్ తో చెలరేగాడు. ఇషాన్ కిషన్ విఫలమైనా దీపక్ హుడాతో కలిసి రెండో వికెట్ కు కీలకమైన 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రేయస్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.



సంజూ సామ్సన్ (15), దినేశ్ కార్తీక్ (12) విఫలం అయ్యారు. చివర్లో తాత్కాలిక కెప్టెన్ హర్దిక్ పాండ్యా (28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 నాటౌట్; 1 సిక్స్) భారీ షాట్లు ఆడటంతో భారత్ 188 పరుగులకు చేరుకుంది. వెస్టిండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు.

తుది జట్లు

టీమిండియా

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇసాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్  హుడా, సంజూ సామ్సన్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రూక్స్, డెవోన్ థామస్, హెట్ మైర్, రోవ్ మన్ పావెల్, జేసన్ హోల్డర్, ఒడియన్ స్మిత్, కీమో పాల్, డ్రేక్స్, మెకాయ్, వాల్ష్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Shreyas Iyer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు