Home /News /sports /

IND VS WI 4TH T20 WEST INDIES WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IND vs WI 4th T20 : టాస్ నెగ్గిన వెస్టిండీస్.. భారీ మార్పులు చేసిన టీమిండియా.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 4th T20 : IND vs WI 4th T20 : వెస్టిండీస్ (West Indies), భారత్ (India) టి20 సిరీస్ లో భాగంగా జరగాల్సిన నాలుగో టి20 వర్షం కారణంగా ఆలస్యం అయ్యింది. రాత్రంతా వర్షం కురవడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs WI 4th T20 : వెస్టిండీస్ (West Indies), భారత్ (India) టి20 సిరీస్ లో భాగంగా జరగాల్సిన నాలుగో టి20 వర్షం కారణంగా ఆలస్యం అయ్యింది. రాత్రంతా వర్షం కురవడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో టాస్ 45 నిమిషాలు ఆలస్యమైంది. టాస్ నెగ్గిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పులు చేసింది. ఫామ్ లో లేని శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజూ సామ్సన్ కు అవకాశం ఇచ్చింది. అతడితోపాటు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ లకు తుది జట్టులో చోటు కల్పించింది. హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ లను పక్కన పెట్టింది. చివరి రెండు టి20లు  అమెరికా (USA)లోని ఫ్లోరిడా (Florida) వేదికగా జరగనున్నాయి.

హార్దిక్, అశ్విన్ ను తప్పించి అవేశ్ ఖాన్ ను ఉంచడమా

ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా మూడు మార్పలు చేసింది. గత మూడు మ్యాచ్ ల్లోనూ పెద్దగా ఆడని శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంజూ సామ్సన్ ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ లను పక్కన పెట్టింది. వారి స్థానాల్లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక గత మూడు మ్యాచ్ ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్న అవేశ్ ఖాన్ కు మరోసారి అవకాశం ఇచ్చింది. అవేశ్ ఖాన్ బదులు హర్షల్ పటేల్ కు ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదో తెలియరాలేదు. ఇక మూడో టి20లో ఓడినప్పటికీ సేమ్ టీంనే కొనసాగించేందుకు విండీస్ జట్టు మొగ్గు చూపింది. ఆ జట్టు ఎటువంటి మార్పులను చేయలేదు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే గెలుస్తుంది. అదే విండీస్ గెలిస్తే మాత్రం సిరీస్ విజేత కోసం ఫైనల్ టి20 వరకు ఆగాల్సి ఉంటుంది.



తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, డ్రేక్స్, ఒడెద్ మెకాయ్,  డెవోన్ థామస్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు