Home /News /sports /

IND VS WI 4TH T20 INDIA VS WEST INDIES 4TH T20I MATCH PREVIEW PREDICTED PLAYING XI HEAD TO HEAD RECORDS PITCH REPORT MATCH TIME SJN

IND vs WI 4th T20 : విండీస్ తో నాలుగో టి20.. ఆ ఇద్దరి ప్లేయర్లపై వేటు.. రోహిత్ ఆడతాడా లేదా? తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 4th T20 : ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ (World Cup) సన్నాహకాల్లో భాగంగా ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs WI 4th T20 : ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ (World Cup) సన్నాహకాల్లో భాగంగా ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా రెంటింటిలో గెలిచిన భారత్ సిరీస్ లో ఆధిక్యంలో ఉంది. నేడు జరిగే నాలుగో టి20లో రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలోని టీమిండియా విజయం సాధించినట్లు అయితే ఇక్కడే భారత్ చేతికి సిరీస్ దక్కుతుంది. చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరగనున్నాయి. వీసా ఇబ్బందులు తలెత్తినా చివరకు ప్లేయర్లందరికీ అమెరికా వీసాలు రావడంతో చివరి రెండు టి20లపై అనుమానాలు తలెత్తాయి. అయితే వీసా మంజూరు కావడంతో వాటికి తెరపడింది. భారత కాలమానం ప్రకారం నాలుగో టి20 శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.

ఇది కూడా చదవండి  : కార్తీక్ కాకా భార్య అంటే ఏమనుకుంటివి.. ఇద్దరు పిల్లల తల్లైనా.. కామన్వెల్త్ గేమ్స్ లో ఏకంగా..!

ఆ ఇద్దరిపై వేటు ఖాయం

వెస్టిండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ ల ో భారత ప్లేయర్లందరూ చక్కగానే రాణిస్తున్నారు. అయితే ఇద్దరి విషయంలో మాత్రం భారత్ తీవ్రంగా కలత చెందుతోంది. బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్, బౌలింగ్ లో అవేశ్ ఖాన్ దారుణంగా విఫలం అవుతున్నారు. సిరీస్ లో ఒక్కసారి కూడా అవేశ్ ఖాన్ తన పూర్తి కోటాను పూర్తి చేయలేదు. ఓవర్ కు 15 పరుగుల చొప్పున సమర్పించుకుంటున్నాడు. దాంతో నాలుగో టి20లో అవేశ్ ఖాన్ ను పక్కన పెట్టి అతడి స్థానంలో హర్షల్ పటేల్ లేదా రవి బిష్ణోయ్ లకు తుది జట్టులో చోటు ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వన్డే సిరీస్ లో ఫర్వాలేదనిపించిన అతడు టి20ల్లో మాత్రం పేలవంగా ఆడుతున్నాడు. మూడో టి20లో 24 పరుగులు చేసినా కూడా స్ట్రయిక్ రేట్ 100 కూడా లేదు. దాంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.



రోహిత్ ఫిట్

నాలుగో టి20లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ గాయపడ్డ సంగతి తెలిసిందే. దాంతో అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే నాలుగో టి20కి ముందు అతడిని పరీక్షించిన ఫిజియో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో నాలుగో టి20లో రోహిత్ బరిలో దిగే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఓపెనర్ గా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత దీపక్ హుడా, హార్దిక్, పంత్, దినేశ్ కార్తీక్ లు చెలరేగేందుకు ఎలాగూ ఉంటారు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ లతో పాటు అశ్విన్ మెరుగ్గా రాణిస్తున్నాడు. వీరికి హర్షల్ పటేల్ జత అయితే భారత్ విజయం నల్లేరు మీద నడకే

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, అశ్విన్, హర్షల్ పటేల్/రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు