Home /News /sports /

IND VS WI 3RD T20I LIVE SCORE UPDATES WITH SURYAKUMAR YADAV BRILLIANT KNOCK TEAM INDIA WON BY 7 WICKETS IN CRUCIAL GAME SRD

IND vs WI : సూర్య జిగేల్.. విండీస్ కుదేల్.. మూడో టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..

సూర్యకుమార్ యాదవ్ (PC : BCCI)

సూర్యకుమార్ యాదవ్ (PC : BCCI)

IND vs WI : రెండో మ్యాచులో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో మూడో టీ20లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

    మూడో టీ20లో టీమిండియా(Team India) అదరగొట్టింది. విండీస్ సెట్ చేసిన 165 పరుగుల టార్గెట్ ను 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది రోహిత్ సేన. దీంతో, ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. గాయంతో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సూపర్ హాఫ్ సెంచరీతో టీమిండియాకు అదిరిపోయే విక్టరీ అందించాడు. దీంతో.. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 76 పరుగులు.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (Rishabh Pant) (26 బంతుల్లో 33 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్ నాటౌట్) రాణించారు. విండీస్ బౌలర్లలో డ్రేక్స్, హోల్డర్, అకిల్ హుస్సేన్ తలా ఓ వికెట్ తీశారు. ఇక, నాలుగో మ్యాచ్ ఈ నెల ఆరు శనివారం నాడు జరగనుంది. సూపర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

    165 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలో అనుకోని షాక్ తగిలింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ అర్ధాంతరంగా క్రీజు వీడి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు..5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ..ఇబ్బందికి గురి కావడంతో ఆ తర్వాతి బంతి తర్వాత ఫిజియోని పిలిపించి కాసేపు మాట్లాడిన రోహిత్, నడవడానికి కష్టపడుతూ పెవిలియన్ చేరడం కనిపించింది.



    అయితే మరో ఓపెనర్.. సూర్య, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 90 పరుగులు జోడించారు. 27 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.అయ్యర్ అవుటయ్యే సమయానికి 11 ఓవర్లలో 105 పరుగులు చేసింది భారత జట్టు.


    44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, డొమినిక్ డ్రాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా 4 పరుగులు చేసి నిరాశపరిచినా రిషబ్ పంత్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు, దీపక్ హుడా 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.

    అంతకుముందు.. వెస్టిండీస్ (West Indies) జట్టు ఫైటింగ్ టోటల్ సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) భారత బౌలర్లను దంచి కొట్టాడు.

    రోవ్ మన్ పావెల్ (23), షమ్రన్ హెట్ మైర్ (20), నికోలస్ పూరన్ (22), బ్రాండన్ కింగ్ (20)లు కూడా రాణించడంతో బ్యాటింగ్ కు కష్టమైన పిచ్ పై విండీస్ జట్టు మంచి స్కోరునే సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ లు చెరో వికెట్ తీశారు. ఇక అవేశ్ ఖాన్ మరోసారి తేలిపోయాడు. 3 ఓవర్లు వేసి వికెట్ కూడా తీయకుండానే ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, IND vs WI, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

    తదుపరి వార్తలు