Home /News /sports /

IND VS WI 3RD T20 WEST INDIES PUT MASSIVE TARGET FOR TEAM INDIA IN 3RD T20I SJN

IND vs WI 3rd T20 : మరోసారి తేలిపోయిన ఆవేశం స్టార్.. ఉతికారేసిన విండీస్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

PC : Windies Cricket

PC : Windies Cricket

IND vs WI 3rd T20 : భారత్ (India)తో జరగుతున్న మూడో టి20లో వెస్టిండీస్ (West Indies) జట్టు భారీ స్కోరును సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.

IND vs WI 3rd T20 : భారత్ (India)తో జరగుతున్న మూడో టి20లో వెస్టిండీస్ (West Indies) జట్టు భారీ స్కోరును సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (50 బంతుల్లో73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) భారత బౌలర్లను దంచి కొట్టాడు. రోవ్ మన్ పావెల్ (23), షమ్రన్ హెట్ మైర్ (20), నికోలస్ పూరన్ (22), బ్రాండన్ కింగ్ (20)లు కూడా రాణించడంతో బ్యాటింగ్ కు కష్టమైన పిచ్ పై విండీస్ జట్టు మంచి స్కోరునే సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ లు చెరో వికెట్ తీశారు. ఇక అవేశ్ ఖాన్ మరోసారి తేలిపోయాడు. 3 ఓవర్లు వేసి వికెట్ కూడా తీయకుండానే ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు.

మేయర్స్ ధనాధన్

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టుకు ఓపెనర్లు కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ శుభారంభం చేశారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్వేచ్ఛగా ఆడారు. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. బ్రాండన్ కింగ్ ను బౌల్డ్ చేసిన హార్దిక్ పాండ్యా భారత్ కు బ్రేక్ ను అందించాడు. అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ తో కూడా రోవ్ మన్ పావెల్ తో కూడా మేయర్స్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో విండీస్ 100 మార్కును అందుకుంది. పూరన్, మేయర్స్ అవుటయ్యాక రోవ్ మన్ పావెల్, హెట్ మైర్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ భారీ స్కోరును అందుకుంది.

తేలిపోయిన అవేశ్

రెండో టి20లో నోబాల్ తో జట్టుకు విజయాన్ని దూరం చేసిన అవేశ్ ఖాన్ మరోసారి తేలిపోయాడు. పేలవమైన బౌలింగ్ తో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అవేశ్ ఖాన్ ఏకంగా 47 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్ కు దాదాపుగా 16 పరుగుల చొప్పున ఇచ్చాడు.

తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, డ్రేక్స్, ఒడెద్ మెకాయ్,  డెవోన్ థామస్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

తదుపరి వార్తలు