Home /News /sports /

IND VS WI 3RD T20 TEAM INDIA WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IND vs WI 3rd T20 : టాస్ నెగ్గిన టీమిండియా.. ఎట్టకేలకు సెంచరీ హీరోకు ఛాన్స్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 3rd T20 : వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా.. భారత్, విండీస్ జట్లు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ లో ఇరు జట్లు కూడా 1-1తో సమంగా ఉన్నాయి.

IND vs WI 3rd T20 : వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా.. భారత్, విండీస్ జట్లు ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించింది. ఫలితంగా సిరీస్ లో ఇరు జట్లు కూడా 1-1తో సమంగా ఉన్నాయి. ఇక సిరీస్ లో ఆధిక్యాన్నిఇచ్చే మూడో టి20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. అందరూ ఊహించనట్లుగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో టి20లో ఊహించని విధంగా టీమిండియా (Team india) ఓడటంతో ఈ మ్యాచ్ లో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని పట్టుదలగా ఉంది. ఇక ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు రెస్ట్ ఇచ్చిన టీమిండియా.. అతడి స్థానంలో దీపక్ హుడా (Deepak Hooda) తుది జట్టులోకి తీసుకుంది. విండీస్ కూడా ఒక మార్పు చేసింది. ఒడియన్ స్మిత్ స్థానంలో డ్రేక్స్ ను తీసుకుంది.

జడేజాకు రెస్ట్

తొలి రెండు టి20ల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చింది. అయితే అతడి స్థానంలో అక్షర్ పటేల్ ను కాదని దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకుంది. గత కొంత కాలంగా జడేజా స్థానంలో టీమిండియా తరఫున అక్షర్ పటేల్ ఆడుతూ వస్తున్నాడు. జడేజా తుది జట్టులో ఉంటే అక్షర్ బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. అయితే జడేజా స్థానంలో హుడాను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకుంది. దీనికి ముఖ్య కారణం విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో హుడా బౌలింగ్ లో కూడా రాణించడమే. ఫలితంగా ఈ మ్యాచ్ లో దీపక్ హుడాను ఆల్ రౌండర్ కోటాలో తుది జట్టులో తీసుకున్నారు. రెండో టి20లో నోబాల్ తో పాటు దారాళంగా పరుగులు సమర్పించుకున్న అవేశ్ ఖాన్ కు మాత్రం భారత్ మరో అవకాశం ఇచ్చింది. రెండో టి20లో విఫలమైనా అవేశ్ ఖాన్ ను మూడో టి20లో కొనసాగించడం విశేషం.

ఓపెనర్ గా ఎవరు?

రాహుల్ లేకపోవడంతో రోహిత్ కు జోడీగా ఓపెనింగ్ లో మ్యాచ్ మ్యాచ్ కు పదే పదే మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ తో టి20 సిరీస్ లో పంత్ ఓపెనింగ్ చేయగా.. విండీస్ తో జరుగుతున్న టి20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. అయితే పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో మూడో టి20లో ఓపెనర్ గా సూర్యకుమార్ ను కొనసాగిస్తారా.? లేక పంత్ కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. లేదంటూ మూడో టి20లో చోటు దక్కించుకున్న దీపక్ హుడాతో ఓపెనింగ్ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో దీపక్ హుడా ఓపెనర్ గా వచ్చిన సంగతి తెలిసిందే.



తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, డ్రేక్స్, ఒడెద్ మెకాయ్,  డెవోన్ థామస్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Shreyas Iyer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు