MS Dhoni : భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాత్ర ఎంతో ఉంది. 2007 టి20 ప్రపంచకప్ తో పాటు భారత్ (India) వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ లో భారత్ ను చాంపియన్ గా నిలిపిన అంశం తెలిసిందే. ఇక 2020 ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా ఇండియన్ క్రికెట్ లో ధోనికి మాత్రం ఇప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. యువ క్రికెటర్లు ఇప్పుడు కూడా అతడి నుంచి సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. నేడు చివరిదైన వన్డే మ్యాచ్ ఆడుతుంది.
వన్డే సిరీస్ అనంతరం భారత్, విండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్, కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లు ఇన్ స్టా లైవ్ లో మాట్లాడుకున్నారు. ఈ లైవ్ లోకి పంత్ ధోనిని కూడా లాగాడు. లైవ్ లోకి వచ్చిన ధోని హాయ్ చెప్పి ఆవెంటనే కాల్ ను కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
MS Dhoni came on Rishabh Pant Instagram live for a moment. #MSDhoni #RishabhPantpic.twitter.com/PaZmyKu3cO
— CRICKET VIDEOS???? (@Abdullah__Neaz) July 26, 2022
Here is Full recording of Rohit’s Insta live with Sky , Pant and Chahal ????
All four are my fav ????
Rip Rohit’s Wi-Fi ???????????????? pic.twitter.com/34gB9Fotiz
— Plasmid (@GOATED_ROHIT) July 26, 2022
ముందుగా పంత్ రిక్వెస్ట్‌ను స్వీకరించిన ధోని భార్య సాక్షి అందరినీ విష్ చేసింది. ఆ తర్వాత ధోనికి మొబైల్ ను తీసుకువెళ్లి ఇచ్చింది. మొదట ధోని అందరికీ హాయ్ చెప్పాడు. ఆ తర్వాత పంత్.. లైవ్ లో ఉన్నామని.. కాసేపు మాతో పాటు ముచ్చటించాల్సిందిగా ధోనిని రిక్వెస్ట్ చేశాడు. దీనిని ఏ మాత్రం పట్టించుకోని ధోని లైవ్ లేదు ఏం లేదు అన్నట్లు కట్ చేశాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్, పంత్, రోహిత్ శర్మ పగలబడి నవ్వారు. పంత్ అయితే.. లైవ్ అనగానే ధోని పారిపోయినట్లు ఉన్నాడంటూ ఫన్నీగా కామెంట్ కూడా చేశాడు. కాసేపటికి యుజువేంద్ర చహల్ తో ధోనిని భర్తీ చేసిన వీరు లైవ్ ను కంటిన్వ్యూ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, India Vs Westindies, MS Dhoni, Rishabh Pant, Rohit sharma, Team India