Home /News /sports /

IND VS WI 2ND T20I WEST INDIES WON THE TOSS AND ELECTED TO FIELD FIRST SJN

IND vs WI 2nd T20 : మూడు గంటలు ఆలస్యంగా టాస్.. నెగ్గిన విండీస్.. స్పిన్నర్ పై వేటు.. ఆ పేసర్ కు ఛాన్స్

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd T20 : మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. వెస్టిండీస్ (West Indies), భారత్ (India) జట్ల మధ్య జరగాల్సిన రెండో టి20 మూడు గంటలు ఆలస్యంగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...
IND vs WI 2nd T20 : మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు పటాపంచలు అయ్యాయి. వెస్టిండీస్ (West Indies), భారత్ (India) జట్ల మధ్య జరగాల్సిన రెండో టి20 మూడు గంటలు ఆలస్యంగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం విండీస్ జట్టు రెండు మార్పులను చేసింది. తొలి టి20లో విఫలమైన బ్రూక్స్, కీమో పాల్ లను తప్పించి వారి స్థానాల్లో బ్రాండన్ కింగ్, డెవోన్ థామస్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇక పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టీమిండియా (Team India) కూడా ఒక మార్పు చేసింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ స్థానంలో అవేశ్ ఖాన్ ను తీసుకుంది.

ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లకు సంబంధించిన లగేజి గ్రౌండ్ కు ఆలస్యంగా చేరుకుంది. ఫలితంగా మ్యాచ్ ను రెండు గంటలు వాయిదా వేశారు. దాంతో 8 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి పది గంటలకు ఆరంభం అవుతుందన ప్రకటించారు. అయితే మరోసారి మ్యాచ్ ఆరంభ సమయాన్ని 11 గంటలకు మార్చారు.

అసలే రాత్రి మ్యాచ్ లు ఇంకా లేటయితే ఎవరు చూస్తారు

వెస్టిండీస్ తో మ్యాచ్ లు అంటే లేట్ నైట్ మ్యాచ్ లని అందరికీ తెలుసు. దాంతో ఈ మ్యాచ్ లను టెలికాస్ట్ చేయడానికి బడా బ్రాడ్ క్యాస్టర్ లు కూడా ముందుకు రాలేదు. అయితే డీడీ స్పోర్ట్స్ రూపంలో ఒక చానెల్ ఉండటంతో ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. అయితే తాజాగా రెండో టి20 లగేజి లేట్ గా రావడంతో  రెండు గంటలు ఆలస్యంగా ఆరంభం కానుంది. వాస్తవానికి ప్లేయర్ల లగేజి ముందే గ్రౌండ్ కు చేరుకోవాలి. అందులో ఆటగాళ్లకు సంబంధించిన కిట్స్ ఉంటాయి. ప్లేయర్లు మైదానానికి చేరుకున్న తర్వాత  వార్మప్ అవుతారు. అయితే కిట్స్ లేటుగా వస్తుండటంతో ప్లేయర్లు వార్మప్ చేయలేకపోయారు. దాంతో మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా మొదలు కానుంది.



తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అవేశ్ ఖాన్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, ఒడియన్ స్మిత్, ఒడెద్ మెకాయ్,  డెవోన్ థామస్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు