Home /News /sports /

IND VS WI 2ND T20I INDIA VS WEST INDIES 2ND T20 MATCH DELAYED BY 2 HRS AFTER LUGGAGE DELAY SJN

IND vs WI 2nd T20I : రెండు గంటలు ఆలస్యంగా ఇండియా, వెస్టిండీస్ రెండో టి20.. వాయిదాకు కారణం ఇదే?

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd T20I :  వెస్టిండీస్ (West Indies), భారత్ (India) జట్ల మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టి20 జరగ్గా.. అందులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక సోమవారం భారత్, విండీస్ జట్ల మధ్య రెండో టి20 జరగాల్సి ఉంది.

ఇంకా చదవండి ...
IND vs WI 2nd T20I :  వెస్టిండీస్ (West Indies), భారత్ (India) జట్ల మధ్య ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టి20 జరగ్గా.. అందులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక సోమవారం భారత్, విండీస్ జట్ల మధ్య రెండో టి20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లకు సంబంధించిన లగేజి గ్రౌండ్ కు ఆలస్యంగా చేరుకుంది. ఫలితంగా మ్యాచ్ ను రెండు గంటలు వాయిదా వేశారు. దాంతో 8 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి పది గంటలకు ఆరంభం కానుంది.

అసలే రాత్రి మ్యాచ్ లు ఇంకా లేటయితే ఎవరు చూస్తారు

వెస్టిండీస్ తో మ్యాచ్ లు అంటే లేట్ నైట్ మ్యాచ్ లని అందరికీ తెలుసు. దాంతో ఈ మ్యాచ్ లను టెలికాస్ట్ చేయడానికి బడా బ్రాడ్ క్యాస్టర్ లు కూడా ముందుకు రాలేదు. అయితే డీడీ స్పోర్ట్స్ రూపంలో ఒక చానెల్ ఉండటంతో ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. అయితే తాజాగా రెండో టి20 లగేజి లేట్ గా రావడంతో  రెండు గంటలు ఆలస్యంగా ఆరంభం కానుంది. వాస్తవానికి ప్లేయర్ల లగేజి ముందే గ్రౌండ్ కు చేరుకోవాలి. అందులో ఆటగాళ్లకు సంబంధించిన కిట్స్ ఉంటాయి. ప్లేయర్లు మైదానానికి చేరుకున్న తర్వాత  వార్మప్ అవుతారు. అయితే కిట్స్ లేటుగా వస్తుండటంతో ప్లేయర్లు వార్మప్ చేయలేకపోయారు. దాంతో మ్యాచ్ రెండు గంటల పాలు ఆలస్యంగా మొదలు కానుంది.



ఈ మధ్య కాలంలో జడేజా టెస్టుల్లో మినహా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాణించిన దాఖలాలు లేవు. అతడికి అక్షర్ పటేల్ రూపంలో బలమై ప్రత్యర్థే ఉన్నాడు. ఇంగ్లండ్ పై సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ద్రవిడ్ రెండో వన్డేలో టీమిండియా కూర్పులు ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. చేసినట్లు అయితే శ్రేయస్ అయ్యర్ స్థానంలో దీపక్ హుడాను.. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ లేదా సంజూ సామ్సన్ ను ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్  విభాగంలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్/దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్/సంజూ సామ్సన్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు