Home /News /sports /

IND VS WI 2ND T20I INDIA VS WEST INDIES 2ND T20 MATCH DELAYED AGAIN SJN

IND vs WI 2nd T20 : ఏందీరా బాబు ఇదీ.. మళ్లీ వాయిదా పడ్డ రెండో టి20.. ఆరంభమయ్యేది ఎప్పుడంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd T20 : భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య జరగాల్సిన రెండో టి20 మరోసారి వాయిదా పడింది.  ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లకు సంబంధించిన లగేజి గ్రౌండ్ కు ఆలస్యంగా చేరుకుంది.

ఇంకా చదవండి ...
IND vs WI 2nd T20 : భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య జరగాల్సిన రెండో టి20 మరోసారి వాయిదా పడింది.  ఈ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆటగాళ్లకు సంబంధించిన లగేజి గ్రౌండ్ కు ఆలస్యంగా చేరుకుంది. ఫలితంగా మ్యాచ్ ను రెండు గంటలు వాయిదా వేశారు. దాంతో 8 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి పది గంటలకు ఆరంభం కానున్నట్లు తేలింది. అయితే మరోసారి మ్యాచ్ ను గంటపాటు వాయిదా వేశారు. దాంతో మ్యాచ్ రాత్రి 11 గంటలకు ఆరంభం కానుంది. అయితే అప్పటికైనా మ్యాచ్ ఆరంభం అవుతుందా లేక రద్దవుతుందా అని అభిమానులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆటగాళ్లు ఇప్పటి వరకు గ్రౌండ్ కు చేరుకోలేదని తెలుస్తోంది.

అసలే రాత్రి మ్యాచ్ లు ఇంకా లేటయితే ఎవరు చూస్తారు

వెస్టిండీస్ తో మ్యాచ్ లు అంటే లేట్ నైట్ మ్యాచ్ లని అందరికీ తెలుసు. దాంతో ఈ మ్యాచ్ లను టెలికాస్ట్ చేయడానికి బడా బ్రాడ్ క్యాస్టర్ లు కూడా ముందుకు రాలేదు. అయితే డీడీ స్పోర్ట్స్ రూపంలో ఒక చానెల్ ఉండటంతో ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. అయితే తాజాగా రెండో టి20 లగేజి లేట్ గా రావడంతో  రెండు గంటలు ఆలస్యంగా ఆరంభం కానుంది. వాస్తవానికి ప్లేయర్ల లగేజి ముందే గ్రౌండ్ కు చేరుకోవాలి. అందులో ఆటగాళ్లకు సంబంధించిన కిట్స్ ఉంటాయి. ప్లేయర్లు మైదానానికి చేరుకున్న తర్వాత  వార్మప్ అవుతారు. అయితే కిట్స్ లేటుగా వస్తుండటంతో ప్లేయర్లు వార్మప్ చేయలేకపోయారు. దాంతో మ్యాచ్ రెండు గంటల పాలు ఆలస్యంగా మొదలు కానుంది.



తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రూక్స్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, ఒడియన్ స్మిత్, ఒడెద్ మెకాయ్, కీమో పాల్ అల్జారీ జోసెఫ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు