Home /News /sports /

IND VS WI 2ND T20 INDIA VS WEST INDIES 2ND T20 MATCH PREVIEW PREDICTED PLAYING XI HEAD TO HEAD RECORDS PITCH REPORT MATCH TIME SJN

IND vs WI 2nd T20 : వెస్టిండీస్ తో రెండో టి20.. ఆ ఇద్దరు డౌటే.. టీమిండియా తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd T20 : రెండు రోజుల విరామం తర్వాత టీమిండియా (Team India) మరో పోరుకు సిద్ధమైంది. వార్నర్ పార్క్ వేదికగా సోమవారం వెస్టిండీస్ (West Indies)తో రెండో టి20 ఆడేందుకు భారత్ రెడీ అయ్యింది.

IND vs WI 2nd T20 : రెండు రోజుల విరామం తర్వాత టీమిండియా (Team India) మరో పోరుకు సిద్ధమైంది. వార్నర్ పార్క్ వేదికగా సోమవారం వెస్టిండీస్ (West Indies)తో రెండో టి20 ఆడేందుకు భారత్ రెడీ అయ్యింది. ఐదు మ్యాచ్ ల టి20 సరీస్ లో ఇప్పటికే జరిగిన తొలి టి20లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక సోమవార జరిగే రెండో టి20లోనూ గెలిచి సిరీస్ కు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో రోహిత్ శర్మ (Rohit Sharma) టీం ఉంది. మరో వైపు తమకు అచ్చొచ్చిన టి20 ఫార్మాట్ లో కూడా తేలిపోవడం విండీస్ కు మింగుడు పడటం లేదు. పవర్ హిట్టర్లు ఉన్నా.. తొలి టి20లో భారత బౌలర్లను ఎలా ఎదుర్కొనాలో వారికి అర్థం కాలేదు. అయితే రెండో టి20లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని నికోలస్ పూరన్ నాయకత్వంలోని విండీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

మార్పులు ఉంటాయా?

విండీస్ తో జరిగిన తొలి టి20లో భారత్ గెలిచినా సరి చేసుకోవాల్సిన లోపాలు అలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భారత మిడిలార్డర్. గత మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో చెలరేగాడు. చివర్లో దినేశ్ కార్తీక్ సూపర్ ఫినిష్ ఇచ్చాడు. వీరిద్దరు ఆడటం వల్లే ప్రత్యర్థి ముందు భారత్ 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయితే శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ లు విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఫర్వాలేదనిపించాడు. విండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ రాణించాడు. అయితే టి20లో మాత్రం డకౌట్ అయ్యాడు. ఒక మ్యాచ్ లో ఆడటం మరో మ్యాచ్ లో విఫలం అవ్వడం అన్నట్లు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ సాగుతోంది. ఈ మధ్య కాలంలో జడేజా టెస్టుల్లో మినహా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాణించిన దాఖలాలు లేవు. అతడికి అక్షర్ పటేల్ రూపంలో బలమై ప్రత్యర్థే ఉన్నాడు. ఇంగ్లండ్ పై సెంచరీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ద్రవిడ్ రెండో వన్డేలో టీమిండియా కూర్పులు ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. చేసినట్లు అయితే శ్రేయస్ అయ్యర్ స్థానంలో దీపక్ హుడాను.. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్ లేదా సంజూ సామ్సన్ ను ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్  విభాగంలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు తొలి టి20లో ఆడిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.



టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్/దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్/సంజూ సామ్సన్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, అశ్విన్, భువనేశ్వర్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Sanju Samson, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు