హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs WI 2nd ODI : భారత బౌలర్లను ఆడుకున్న పూరన్, హోప్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం.. ఎంతంటే?

IND vs WI 2nd ODI : భారత బౌలర్లను ఆడుకున్న పూరన్, హోప్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd ODI : టీమిండియా (Team India)తో జరుగుతోన్న రెండో వన్డేలో వెస్టిండీస్ (West Indies) ప్లేయర్లు షై హోప్ (Shai Hope), నికోలస్ పూరన్ (Nicholas Pooran)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 

IND vs WI 2nd ODI : టీమిండియా (Team India)తో జరుగుతోన్న రెండో వన్డేలో వెస్టిండీస్ (West Indies) ప్లేయర్లు షై హోప్ (Shai Hope), నికోలస్ పూరన్ (Nicholas Pooran)లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.  ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరూ భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. హోప్ (135 బంతుల్లో 115; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)  శతకంతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఫలితంగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీపక్ హుడా, అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్ లు తలా ఒక వికెట్ తీశారు.

టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా వచ్చిన షై హోప్, కైల్ మేయర్స్ (23 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) విండీస్ కు శుభారంభం చేశారు. వీరు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. అయితే పార్ట్ టైమ్ బౌలర్ దీపక్ హుడా మేయర్స్ ను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్రూక్స్ (36 బంతుల్లో 35; 5 ఫోర్లు) కూడా రాణించాడు. బ్రూక్స్ తో కలిసి షై హోప్ రెండో వికెట్ కు 62 పరుగులు జోడించాడు. అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి బ్రూక్స్ పెవిలియన్ కు చేరాడు. బ్రాండన్ కింగ్ (0)ను యుజువేంద్ర చహల్ అవుట్ చేశాడు.

నిలబెట్టిన పూరన్, హోప్

భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీయడంతో వెస్టిండీస్ 3 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ హోప్ తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. మొదట కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న పూరన్.. ఆ తర్వాత చెలరేగిపోయాడు. మరో ఎండ్ లో ఉన్న హోప్ అతడికి స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. పూరన్ తన ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి.. 6 సిక్సర్లు బాదాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 117 పరుగులు జోడించారు. సెంచరీ చేసేలా కనిపించిన పూరన్ ను శార్దుల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే భారీ సిక్సర్ కొట్టి షై హోప్ సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో రొవ్ మన్ పావెల్ (13), రొమారియో షెపర్డ్ (15 నాటౌట్) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. సిరాజ్ వేసిన చివరి ఓవర్లో సిక్సర్ బాదిన అకీల్ హోసీన్ (6) జట్టు స్కోరును 311 పరుగులకు చేరేలా చేశాడు.

First published:

Tags: India, India Vs Westindies, Mohammed Siraj, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India, West Indies

ఉత్తమ కథలు