Home /News /sports /

IND VS WI 2ND ODI TEAM INDIA COACH RAHUL DRAVID ANGRY REACTION OVER FIELD POSITIONS VIDEO GOES VIRAL SJN

IND vs WI 2nd ODI : ’అరె.. ఏం ఫీల్డింగ్ రా బాబు ఇదీ‘ కోచ్ ద్రవిడ్ వీరంగం మామూలుగా లేదుగా.. (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 2nd ODI : భారత్ (India) వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి పోరులో భారత్ కేవలం 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై నెగ్గింది.

IND vs WI 2nd ODI : భారత్ (India) వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి పోరులో భారత్ కేవలం 3 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై నెగ్గింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అద్భత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఆఖరి ఓవర్లో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తన ఎమోషన్ ను అదుపులో ఉంచుకోలేకపోయాడు. డగౌట్ నుంచే శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఫీల్డింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : రెండేళ్ల తర్వాత వన్డేల్లోకి వచ్చాడు.. రాగానే సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.. వాట్ ఏ ప్లేయర్..

చివరి ఓవర్లో వెస్టిండీస్ విజయం కోసం 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆఖరి ఓవర్ ను వేయడానికి మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. క్రీజులో రొమారియో షెపర్డ్, హోసీన్ లు ఉన్నారు. తొలి రెండు బంతులకు సిరాజ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు.  మూడో బంతిని షెపర్డ్ బౌండరీ బాదాడు. దాంతో డగౌట్ లో ఉన్న రాహుల్ ద్రవిడ్ కు కోపం వచ్చినట్లు ఉంది. ’ఏంటా ఫీల్డ్ పోజిషన్స్‘ అంటూ పక్కనే ఉన్న బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ తో అంటాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.  ''యాక్షన్‌, ఎమోషన్స్‌ మన చేతుల్లో ఉండవు అనడానికి ఇదే నిదర్శనం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఇక ఆఖరి ఓవర్లో ఐదు యార్కర్స్‌ వేసిన సిరాజ్‌ 11 పరుగులు మాత్రమే ఇవ్వడంతో టీమిండియా బతికిపోయింది.



308 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (54; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు బాదారు. బ్రూక్స్ (46) రాణించాడు. చివర్లో షెపర్డ్ (39), అకీల్ హొసీన్ (32) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడారు. భారత బౌలర్లలో సిరాజ్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్ తలా రెండు వికెట్లు తీశారు. రెండో వన్డే ఆదివారం జరగనుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India Vs Westindies, Mohammed Siraj, Rahul dravid, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు