Home /News /sports /

IND VS WI 2022 I AM READY FOR WHATEVER RESPONSIBILITY IS GIVEN TO ME MOHAMMED SHAMI AMID INDIA TEST CAPTAINCY OPTIONS SK

Team India: కెప్టెన్సీకి మహ్మద్ షమీ రెడీ.. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది?

మహమ్మద్ షమీ

మహమ్మద్ షమీ

Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కెప్టెన్సీ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలిచ్చాడు.

    టీమిండియాకు టెస్ట్ కెప్టెన్ (Team India test captain) ఎవరు? ఇప్పుడు క్రీడాభిమానులంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ తప్పుకున్న తర్వాత.. ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. దానిని భర్తీ చేసేదెవరన్న దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. కెప్టెన్సీ రేసులో హిట్ మ్యాన్ రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, జాస్పిత్ బుమ్రా, రిషభ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే బీసీసీ మాత్రం రోహిత్ శర్మ (Rohit Sharma) వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammad shami) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా కెప్టెన్సీ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలిచ్చాడు. కెప్టెన్సీ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని పేర్కొన్నాడు. అంతకంటే అదృష్టం ఇంకేం ఉంటుందని అభిప్రాయపడ్డాడు మహమ్మద్ షమి.

    KL Rahul: అతడు పనికి రాడు.. కేఎల్ రాహుల్‌పై క్రీడల మంత్రి సంచలన వ్యాఖ్యలు

    టెస్ట్ కెప్టెన్సీపై ఇటీవల హర్భజన్ సింగ్  (Harbhajan singh)  కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ శర్మ పర్‌ఫెక్ట్ అని.. ఆయన కాకుంటే బమ్రాకు అప్పగించవచ్చని అన్నారు. తానైతే మూడు ఫార్మట్లకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటానని.. ఒకవేళ ఆ మూడింటికీ సారథ్యం వహించడం రోహిత్ శర్మకు నచ్చకపోతే.. టెస్ట్ క్రికెట్‌ బాధ్యతను బుమ్రాకు అప్పగించాలని చెప్పారు హర్భజన్ సింగ్. ఫాస్ట్ బౌలర్లు సానుకూలంగా ఆలోచిస్తారని అభిప్రాయపడ్డాడు. బౌలర్‌గా ఉన్న కపిల్ దేవ్‌ (Kapil Dev) కూడా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యారని ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ గుర్తు చేశారు. బుమ్రా కూడా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని.. టెస్ట్ కెప్టెన్సీకి రోహిత్ ఒప్పుకోకుంటే, బుమ్రాను కెప్టెన్ చేయాలని చెప్పాడు.

    IND vs WI: రోహిత్ ఈజ్ బ్యాక్.. వాళ్లు ఔట్..వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టీ20 జట్లు ఇవే

    ఐతే హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందించారు. ఫాస్ట్ బౌలర్లు జట్టులో సుదీర్ఘకాలం కొనసాగడం కష్టమని.. అలాంటప్పుడు వారిని కెప్టెన్‌గా నియమించడం సరికాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఒకవేళ బౌలర్‌కు కెప్టెన్సీ ఇవ్వాలంటే.. బాబ్ విల్లిస్ (ఇంగ్లండ్ మాజీ పేసర్) లాగా ఎప్పుడూ జట్టులో ఉండే ఆటగాడు అయ్యి ఉండాలని పేర్కొన్నారు. ఒక ఫేసర్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించగలిగినప్పుడే... అతడు కెప్టెన్సీ గురించి ఆలోచించాలని తెలిపారు. కానీ అటువంటి ఆటగాళ్లు భారత్‌లో తక్కువని చెప్పారు. ఓ కపిల్ దేవ్, ఓ గారిఫీల్డ్ సోబర్స్ లాంటి ఆటగాళ్లు అయితే టీమిండియాకు సారథిగా సరిపోతారని రవిశాస్త్రి పేర్కొన్నారు.

    Padma Awards: షూటర్ అవనీ లేఖరాను వరించిన పద్మశ్రీ పురస్కారం.. ఆమె గురించి

    కాగా, వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ వన్డే , టీ20 సిరీస్‌లు ఫిబ్రవరి 6న ప్రారంభమై ఫిబ్రవరి 20తో ముగుస్తాయి. ఫిబ్రవరి 6న తొలివన్డే, 9న రెండో వన్డే, 11న మూడో వన్డే జరుగనుంది. ఇక ఫిబ్రవరి 16న తొలి టీ20, 17న రెండో టీ20, 20న మూడో టీ20 నిర్వహిస్తారు. ​
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cricket, Mohammed Shami, Rahul dravid, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు