IND VS WI 2022 BCCI ANNOUNCES INDIA SQUAD FOR WEST INDIES SERIES ROHIT SHARMA RETURNS RAVI BISHNOI GETS MAIDEN CALL UP SK
IND vs WI: రోహిత్ ఈజ్ బ్యాక్.. వాళ్లు ఔట్.. వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టీ20 జట్లు ఇవే..
రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ
Ind Vs WI 2022: విండీస్‌తో జరగనున్న వన్డే , టీ20 సిరీస్‌లు.. ఫిబ్రవరి 6న ప్రారంభమై ఫిబ్రవరి 20తో ముగుస్తాయి. మరి వన్డే జట్టులో ఎవరున్నారు? టీ20 టీమ్‌లో ఎవరున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
బాస్ ఈజ్ బ్యాక్..! భారత జట్టులోకి మళ్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వచ్చాడు. వెస్టిండీస్ (West Indies)తో జరగనున్న సిరీస్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో మనదేశంలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సంబంధించి భారత జట్లను(India squad for West Indies series) సెలెక్టర్లు ప్రకటించారు. గాయంతో కారణంగా సౌతాఫ్రికా (South Africa) టూర్‌కు దూరమైన రోహిత్ శర్మ తిరిగి టీమ్‌లోకి వచ్చాడు. వన్డే, టీ20 జట్లకు అతడే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఐపీఎల్లో సత్తాచాటుతున్న రవి బిష్ణోయ్‌కు టీమిండియాలో అవకాశం వచ్చింది. వన్డే, టీ20లకు అతడిని ఎంపిక చేశారు. చాలా రోజులుగా టీమ్‌లో స్థానం కోసం ఎదురు చూస్తున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. వన్డే మ్యాచ్‌ల కోసం అతడిని ఎంపిక చేశారు.
ఇక ఆల్‌రౌండర్ దీపక్ హుడాకు వన్డేల్లో చోటు దక్కింది. ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్ టీ20 స్థానం సంపాదించుకున్నాడు. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ని వన్డేల నుంచి సెలెక్టర్లు పక్కన పెట్టారు. టీ20ల్లో మాత్రం కొనసాగతాడు. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్‌ని వన్డేలతో పాటు టీ20లకు కూడా ఎంపిక చేశారు సెలెక్టర్లు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పూర్తిగా పక్కనబెట్టేశారు. వన్డే, టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు. భారత పేస్ సంచలనాలు జాస్ప్రిత్ బుమ్రా, షమీ కూడా ఈ సిరీస్‌లో ఆడడం లేదు. వీరిద్దరికి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వన్డే టీమ్ పూర్తిగా జూనియర్ పేసర్లతోనే విండీస్‌ను ఢీకొట్టనుంది. టీ20ల్లో మాత్రం సీనియర్ పేసర్ భువనేశ్వర్ అందుబాటులో ఉంటాడు.
విండీస్‌తో జరగనున్న వన్డే , టీ20 సిరీస్‌లు.. ఫిబ్రవరి 6న ప్రారంభమై ఫిబ్రవరి 20తో ముగుస్తాయి. ఫిబ్రవరి 6న తొలివన్డే, 9న రెండో వన్డే, 11న మూడో వన్డే జరుగనుంది. ఇక ఫిబ్రవరి 16న తొలి టీ20, 17న రెండో టీ20, 20న మూడో టీ20 నిర్వహిస్తారు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటించిన టీమిండియా ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. టెస్ట్‌తో పాటు వన్డే సీరిస్‌ను కూడా కోల్పోయింది. టెస్ట్ సిరీస్‌ను 1-2తేడాతో కోల్పోతే.. వన్డేల్లో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వైట్ వాష్ అయింది. రోహిత్ శర్మ లేకపోవడం కూడా మైనస్ అయింది. ఐతే విండీస్‌తో సిరీస్‌లకు హిట్ మ్యాన్ అందుబాటులోకి రావడంతో..ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.