IND vs WI 1st T20 : వెస్టిండీస్ (West Indies)తో జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసిన టీమిండియా (Team India) రోజు విరామం తర్వాత ధనాధన్ ఫార్మాట్ లో సిరీస్ ను మొదలు పెట్టనుంది. వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కు రెస్ట్ తీసుకున్న భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా (Hardik Pandya), రిషభ్ పంత్ (Rishabh Pant)లు తిరిగి జట్టులోకి చేరనున్నారు. వీరితో పాటు భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), దినేశ్ కార్తీక్ (Dinesh Karthik)లు కూడా టి20 సిరీస్ ల్లో భాగంగా ఉన్నారు. ఈ మేరకు విండీస్ తో జరిగే టి20 సిరీస్ లో కూడా అదరగొట్టి పర్యటనను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంలో టీమిండియా ఉంది.
ఓపెనర్ గా మరోసారి పంత్!
ఇంగ్లండ్ తో జరిగిన టి20 సిరీస్ లో రోహిత్ కు జోడీగా రిషభ్ పంత్ ఓపెనింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సిరీస్ లో ఓపెనర్ గా పంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో కూడా పంత్ ను ఓపెనర్ గా పంపిస్తారేమో చూడాలి. కోచ్ ద్రవిడ్ మాత్రం పంత్ ను మరోసారి ఓపెనర్ గా పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఇషాన్ కిషన్ కు ఈ సిరీస్ లో కూడా నిరాశే ఎదురుకానుంది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ప్లేస్ కోసం దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే సీనియారిటీ పరంగా శ్రేయస్ అయ్యర్ కు ఆ అవకాశం దక్కనుంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు ఆ తర్వాతి స్థానాల్ల ో ఆడతారు. దినేశ్ కార్తీక్ కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఎందుకంటే టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేశాక సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో అదరగొట్టిన అతడు.. ఐర్లాండ్, ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ల్లో విఫలం అయ్యాడు. దాంతో అతడికి ఈ సిరీస్ కీలకం కానుంది.
గాయంతో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా ఈ టి20 సిరీస్ లో ఆడే అవకాశం ఉంది. ఒక వేళ కోలుకోనట్లయితే అక్షర్ పటేల్ ఆడతాడు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లతో పాటు అర్ష్ దీప్ పేసర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ల మధ్య తీవ్ర పోటీ ఉంది. అశ్విన్ కంటే కూడా కుల్దీప్ వైపే కోచ్ ద్రవిడ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మ్యాచ్ రాత్రి గం 8 నుంచి ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India