హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs WI 1st T20I : టాస్ ఓడిన టీమిండియా.. ఓపెనర్ గా అతడా.! వెటరన్ కు మరో ఛాన్స్.. తుది జట్లు ఇవే

IND vs WI 1st T20I : టాస్ ఓడిన టీమిండియా.. ఓపెనర్ గా అతడా.! వెటరన్ కు మరో ఛాన్స్.. తుది జట్లు ఇవే

PC : TWITTER

PC : TWITTER

IND vs WI 1st T20I : ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ (Worldcup) సన్నాహకాల్లో భాగంగా టీమిండియా (Team India) వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు సిద్ధమైంది. శుక్రవారం తొలి టి20 జరగనుండగా.. టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...

IND vs WI 1st T20I : ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ (Worldcup) సన్నాహకాల్లో భాగంగా టీమిండియా (Team India) వెస్టిండీస్ (West Indies)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు సిద్ధమైంది. శుక్రవారం తొలి టి20 జరగనుండగా.. టాస్ నెగ్గిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) రిషభ్ పంత్ (Rishabh Pant), హార్దిక్ పాండ్యా (Hardik Pandya)లు తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో కరోనా కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా  ఉన్న రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మళ్లీ జట్టులోకి రావడం విశేషం.

ఊహించని సెలెక్షన్

వెస్టిండీస్ తో జరిగిన తొలి టి20లో భారత కూర్పు ఊహించని విధంగా ఉంది. ఐపీఎల్ లో రాణించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కుల్దీప్ యాదవ్ ను కాదని.. రవి బిష్ణోయ్ ని తుది జట్టులోకి తీసుకోవడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. అదే సమయంలో ఫామ్ లో ఉన్న హర్షల్ పటేల్ ను పక్కన పెట్టింది. ఇక వయో భారంతో టి20లకు సరిపోడు అనుకున్న అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.  స్వతహాగాా విండీస్ పిచ్ లు మందకొడిగా ఉంటాయి. అయినప్పటికీ భారత్ ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

ఓపెనర్ గా సూర్యకుమార్ యాదవ్

ఊహించని విధంగా ఓపెనర్ గా సూర్యకుమార్ యాద్ ను కోచ్ ద్రవిడ్ ఎంపిక చేశాడు. రోహిత్ తో కలిసి అతడు తొలి టి20లో ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక అదే సమయంలో పంత్ మూడో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్ తో జరిగిన చివరి టి20లో శతకంతో మెసిరందే తప్ప ఆ తర్వాత పెద్దగా ఆడింది లేదు. దాంతో అతడికి ఈ సిరీస్ చాలా ముఖ్యం. వీరితో పాటు దినేశ్ కార్తీక్ కు కూడా ఈ సిరీస్ ముఖ్యమే.

తుది జట్లు 

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్,  అర్ష్ దీప్ సింగ్

వెస్టిండీస్

నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రూక్స్, రోవ్ మన్ పావెల్, కైల్ మేయర్స్, జేసన్ హోల్డర్ షిమ్రన్ హెట్ మైర్, అకీల్ హోసీన్, ఒడియన్ స్మిత్, ఒడెద్ మెకాయ్, కీమో పాల్ అల్జారీ జోసెఫ్

First published:

Tags: Axar Patel, Dinesh Karthik, Hardik Pandya, India Vs Westindies, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India

ఉత్తమ కథలు