హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket viral celebration : ఇదేం సెలబ్రేషన్ రా బాబూ.. వికెట్ తీసిన ఆనందంలో ఆ ప్లేయర్.. చూస్తే నవ్వాల్సిందే!

Cricket viral celebration : ఇదేం సెలబ్రేషన్ రా బాబూ.. వికెట్ తీసిన ఆనందంలో ఆ ప్లేయర్.. చూస్తే నవ్వాల్సిందే!

PC L INSTAGRAM

PC L INSTAGRAM

Cricket viral celebration : వికెట్ తీసినపుడు ఒక్కో బౌలర్ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఒకరు గాల్లోకి ఎగురుతూ సెలబ్రేట్ చేసుకుంటే.. ఇంకొకరు వినూత్న స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకుంటారు.

Cricket viral celebration : వికెట్ తీసినపుడు ఒక్కో బౌలర్ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఒకరు గాల్లోకి ఎగురుతూ సెలబ్రేట్ చేసుకుంటే.. ఇంకొకరు వినూత్న స్టెప్పులతో సెలబ్రేట్ చేసుకుంటారు. వికెట్ ను సెలబ్రేట్ చేసుకోవడంలో వెస్టిండీస్ () ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు. షెల్డన్ కాట్రెల్ సెల్యూట్ తో సెలబ్రేట్ చేసుకుంటే.. డీజే బ్రావో కొత్త కొత్త స్టెప్పులతో వికెట్ ఆనందాన్ని పొందుతాడు. తాజాగా సెర్బియా దేశానికి చెందిన ప్లేయర్ ఊహించని రీతిలో వికెట్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఐసీసీ పురుషుల టి20 వరల్డ్‌కప్‌ సబ్‌ రీజియన్‌ క్వాలిఫయర్స్‌ గ్రూఫ్‌-ఏలో సెర్బియా, ఐఓఎం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో సెర్బియా బౌలర్ అయో మేనే ఎజెగి నాలుగు వికెట్లతో మెరిశాడు. వికెట్ తీసిన ప్రతిసారి కూడా అతడు గ్రౌండ్ లో పిల్లి మొగ్గలు వేశాడు. ఒక వికెట్‌ తీసిన సందర్భంలో గ్రౌండ్‌పై రెండుసార్లు ఫ్లిప్‌(గెంతులు) చేసి ఆ తర్వాత నేలపై తన చేతులను చాచి పడుకున్నాడు. ఈ వింత సెలబ్రేషన్‌ అక్కడున్న వారి చేత నవ్వులు పూయించింది. ఈ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్‌ చేసిన ఐసీసీ.. ''వందో వికెట్‌ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్‌ చేసుకున్న సెర్బియా క్రికెటర్‌ అయో మేనే-ఎగిజి'' అని క్యాప్షన్‌ జత చేసింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోకు దాదాపు 3 లక్షల లైక్స్‌ రావడం విశేషం.









View this post on Instagram






A post shared by ICC (@icc)



ఇక మ్యాచ్‌లో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ 68 పరుగుల తేడాతో సెర్బియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సెర్బియా పూర్తి ఓవర్లు ఆడినప్పటికి ఏడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇప్పటికే ఆతిథ్య హోదాలో ఆస్ట్రేలియా సహా భారత్‌, న్యూజిలాండ్‌ లాంటి టాప్‌-8 దేశాలు అర్హత సాధించాయి. మరో నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో టి20 ప్రపంచకప్‌ సూపర్‌ 12 స్టేజీ ప్రారంభం కానుంది.

First published:

Tags: Cricket, ICC, India Vs Westindies, Sanju Samson, Shikhar Dhawan, Shreyas Iyer, T20 World Cup 2022, Viral

ఉత్తమ కథలు