IND vs SL: చతేశ్వర్ పుజారా (Cheteswar Pujara, ), అజింక్య రహానే (Ajinkya rahane) మొన్నటి వరకు టెస్టుల్లో భారత (India) జట్టు మిడిలార్డర్ భారాన్ని మోశారు. అయితే గత కొంత కాలంగా ఫామ్ లోని వీరు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. దాంతో జట్టుకు భారంగా మారారు. ఫలితంగా శ్రీలంక (Srilanka)తో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్ కు బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ పుజారా, రహానేలను ఎంపిక చేయలేదు. పుజారా, రహానేలపై వేటు వేయడం పెద్ద ఆశ్యర్యానికి కూడా గురి చేయలేదు. అయితే వచ్చే శ్రీలంక టెస్టు సిరీస్ లో వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే పుజారా, రహానే స్థానాల కోసం ముగ్గురి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)
ఈ జాబితాలో అందరికంటే ముందు వరుసలో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. న్యూజిలాండ్ (New Zealand)తో గతేడాది జరిగిన టెస్టు సిరీస్ తో సుదీర్ఘ ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ డెబ్యూ మ్యాచ్ లోనే శతకంతో మెరిశాడు. దాంతో అనంతరం దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన టెస్టు సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే రహానే గాయం నుంచి కోలుకోవడంతో అతడి శ్రేయస్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఫామ్ పరంగా చూస్తే శ్రేయస్ అయ్యర్ సూపర్ టచ్ లో ఉన్నాడు. వెస్టిండీస్ (West Indies)తో జరిగిన సిరీస్ లో అవకాశాలు రాకపోయినా... శ్రీలంక తో జరిగిన సిరీస్ లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మూడు టి20ల్లోనూ అజేయంగా 57, 74, 73 పరుగులు చేసి ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‘గా నిలిచాడు. దాంతో రహానే స్థానం భవిష్యత్తులో ఇతడిదే కావొచ్చు.
శుబ్ మన్ గిల్ (Shubman gill)
టెస్టు ఓపెనర్ గా జట్టులోకి వచ్చి... అనంతరం గాయంతో దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్టు సిరీస్ కు దూరమమైన యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్... ఓపెనర్ గా కానీ లేక ఫుజారా స్థానంలో కానీ బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రీలంక తో జరిగే టెస్టు సిరీస్ లో రోహిత్ కు జోడీగా మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గాయంతో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు దూరమైన కేఎల్ రాహుల్ (KL Rahul)... కోలుకొని జట్టులోకి వస్తే మాత్రం మయాంక్ డగౌట్ కే పరిమితమయ్యే చాన్స్ ఉంది. అయితే ఇక్కడ పుజారా స్థానం శుబ్ మన్ గిల్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. గిల్ తాను ఆడిని చివరి సిరీస్ లో న్యూజిలాండ్ పై నాలుగు ఇన్నింగ్స్ లలో 52, 2, 44, 47 పరుగులు చేశాడు. అనంతరం గాయంతో సౌతాఫ్రికాతో సిరీస్ కు దూరమయ్యాడు.
హనుమ విహారీ (Hnuma vihari )
వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత టీమిండియా తరఫున టెస్టుల్లో నిలకడగా ఆడుతోన్న తెలుగు తేజం మన హనుమ విహారీ. అయితే తుది జట్టులో హనుమ విహారీ స్థానం ఎప్పుడూ పజిల్ లానే ఉంటుంది. విదేశీ గడ్డపై మాత్రమే ఇతడికి అవకాశం ఇస్తూ... స్వదేశంలో మాత్రం బెంచ్ కే పరిమితం చేస్తూ ఉంటారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. స్పిన్ కు అనుకూలించని విదేశీ గడ్డపై భారత్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ తో ఆడుతుంది కాబట్టి... ఆరో స్థానాన్ని విహారికి కేటాయిస్తారు. అదే ఇండియాలో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు కాబట్టి... విహారీ రిజర్వ్ బెంచ్ కే పరిమితం అవుతాడు. పుజారా, రహానే గైర్హాజరీలో శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు సిరీస్ లో విహారీ కి కూడా చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లను తుది జట్టులోకి తీసుకున్నట్లుయితే విహారీకి చాన్స్ దొరకడం కష్టమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Cheteswar Pujara, Hanuma vihari, India, Shreyas Iyer, Team India