Ind vs SL : శ్రీలంక (Srilanka)తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో భారత (India) స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan kishan) చిచ్చర పిడుగులా చెలరేగి పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గా బరిలోకి దిగిన అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దొరికిన బంతిని దొరికినట్లు స్టాండ్స్ లోకి పంపుతూ టీమిండియా (Team India)కు భారీ స్కోరును అందించాడు. మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. సెంచరీ చేసేలా కనిపించిన ఇషాన్... ఆ ఘనతకు 11 పరుగుల దూరంలో భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అయితే ఈ మ్యాచ్ తో ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అది కూడా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), యువ కీపర్ రిషభ్ పంత్ (Rishabh pant)లకు సాధ్యం కానిదాన్ని ఇషాన్ చేసి చూపించాడు.
టీమిండియా తరఫున టి20ల్లో మాజీ సారథి ధోని తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ గా తొలి టి20 ప్రపంచ కప్ లో భారత్ (India)ను విజేతగా నిలిపాడు. అయితే ఎన్నడూ కూడా టి20ల్లో 80 ప్లస్ పరుగులను సాధించలేకపోయాడు. 98 అంతర్జాతీయ టి20లు ఆడిన ధోని అత్యధిక స్కోరు 56 పరుగులే. అది కూాడా 2017లో ఇంగ్లండ్ (England)తో జరిగిన మ్యాచ్ ద్వారా ఈ స్కోరును అందుకున్నాడు. ఇక యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా టి20ల్లో 80 ప్లస్ ను అందుకోలేకపోయాడు. అతడి అత్యధిక స్కోరు 65 పరుగులు. 2019లో వెస్టిండీస్ (West indies)తో జరిగిన మ్యాచ్ ద్వారా పంత్ ఈ స్కోరును అందుకున్నాడు.
శ్రీలంకతో జరిగే సిరీస్ కు పంత్ కు విశ్రాంతి కల్పించడంతో... ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ పాత్రను పోషిస్తున్నాడు. గురువారం జరిగిన తొలి 20లో ఓపెనర్ గా వచ్చి 89 పరుగులు సాధించాడు. దాంతో 80 ప్లస్ స్కోరును సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా ఇషాన్ రికార్డు కెక్కాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున ఒక వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో భారత్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1 0 తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 57 నాటౌట్), హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (rohit sharma) (32 బంతుల్లో 44) అదరగొట్టారు. అంతేకాకుండా రోహిత్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. చరిత్ అసలంక అజేయ అర్ధ సెంచరీ (53 పరుగులు)తో ఫర్వాలేదనిపించగా... మిగిలిన వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, India, India vs srilanka, MS Dhoni, Rishabh Pant, Rohit sharma, Sri Lanka, Team India, West Indies