IND vs SL: శ్రీలంక (Sri lanka)తో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా (Team India)కు గుడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axer patel) కోలుకున్నాడు. దాంతో అతడిని భారత జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ (BCCI)పేర్కొంది. అదే సమయంలో అతడికి బ్యాకప్ గా ఎంపిక చేసిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను టీం నుంచి తప్పించింది. దాంతో ఈ నెల 12 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టు జట్టు నుంచి కుల్దీప్ యాదవ్ తప్పుకున్నాడు. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దాంతో అతడు దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు కోలుకోవడంతో మళ్లీ టీంలోకి వచ్చాడు.
ఈ నెల 12 నుంచి బెంగళూరు (bangalore)లోని చిన్నస్వామి స్టేడియంలో డే అండ్ నైట్ టెస్టు జరగనుంది. పింక్ బంతితో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా గత మ్యాచ్ లో లాకే ఇద్దరు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్ల పాలసీని కంటిన్యూ చేస్తే తుది జట్టులో అక్షర్ పటేల్ కు చాన్స్ దొరికే అవకాశం ఉంది. దాంతో అతడు జయంత్ యాదవ్ ప్లేస్ లో ప్లేయింగ్ లెవెన్ లోకి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి గులాబీ బంతి పేస్ కు అనుకూలంగా ఉంటుంది. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ మొహాలి టెస్టుకు విరుద్దంగా టీం కూర్పును రూపొందించే అవకాశం ఉంది. ముగ్గురు స్పిన్నర్లతో కాకుండా ముగ్గరు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే జయంత్ యాదవ్ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడు. ఇక అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావల్సి ఉంటుంది.
సెంచరీతో పాటు 5 వికెట్లు తీసిన నాలుగో భారత ప్లేయర్ గా జడ్డూ
టెస్టుల్లో టీమిండియా తరఫున ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా రవీంద్ర జడేజా ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు దిగ్గజ ప్లేయర్ వినూ మన్కడ్ (184 పరుగులు, 5 వికెట్లు), పాలి ఉమ్రిగర్ (172 నాటౌట్; 5 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) లు ఉన్నారు. వినూ మన్కడ్ 1952లో ఇంగ్లండ్ పై ఈ ఘనత సాధిస్తే... పాలీ ఉమ్రిగర్ 1962లో వెస్టిండీస్ పై సాధించాడు. ఇక అశ్విన్ అయితే ఏకంగా మూడు సార్లు ఒకే మ్యాచ్ లో సెంచరీతో పాటు 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. 2011లో వెస్టిండీస్ పై 103 పరుగులతో పాటు 5 వికెట్లు తీసిన అశ్విన్... 2016లో మళ్లీ వెస్టిండీస్ పైనే 113 పరుగులతో పాటు 7 వికెట్లు తీశాడు. ఇక గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ 106 పరుగులు చేసిన అశ్విన్ 5 వికెట్లు తీశాడు. తాజాగా రవీంద్ర జడేజా వీరి సరసన నిలిచాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Bcci, India, India vs srilanka, New Zealand, South Africa, Sri Lanka, Team India