IND vs SL : బెంగళూరు (Bengaluru) వేదికగా భారత్ (India), శ్రీలంక (Sri lanka) జట్ల మధ్య చివరి దైన రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. డే అండ్ నైట్ రూపంలో జరుగుతోన్న ఈ టెస్టు శనివారం ఆరంభమైంది. పింక్ బంతితో హడలెత్తించిన ఇరు జట్ల బౌలర్లు తొలి రోజే ఏకంగా 16 వికెట్లు పడగొట్టారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివరకు సెంచరీకి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. అయితే భారత్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తోండగా... 12వ ఓవర్ వేయడానికి మహ్మద్ షమీ (Mohammed Shami) బౌలింగ్ కు వచ్చాడు.
అయితే అతడి బౌలింగ్ లో డిఫెన్స్ ఆడే క్రమంలో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి నేరుగా వెళ్లి ధనుంజయ ప్యాడ్ కు తగలడంతో భారత ప్లేయర్స్ ఎల్బీ కోసం అంపైర్ కు అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ వీరి అప్పీల్ ను తిరస్కరించాడు. అయితే షమీ కాన్ఫిడెన్స్ గా ఉండటంతో వి దాంతో రోహిత్ శర్మ (Rohit Sharma)... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh pant), స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli)లతో చర్చించి రివ్యూకు వెళ్లాడు.
రీప్లేలో అది అవుట్ గా తేలింది. దాంతో భారత ఆటగాళ్లు వికెట్ తీసిన ఆనందంలో ఉండగా... షమీని అభినందించడానికి వచ్చిన అశ్విన్ తుంటరి పని చేశాడు. సెలబ్రేషన్స్ లో భాగంగా షమీ తలను తబలా వాయించినట్లు అశ్విన్ వాయించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా పలువురు నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ పెడుతున్నారు.
That's some way to celebrate ? pic.twitter.com/wqLyvvXS5a
— Sports Hustle (@SportsHustle3) March 12, 2022
షమీ తలను తబలా వాయించినట్లు వాయించడం షమీకి ఇదేమి కొత్త కాదు. శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు సందర్భంగా కూడా అశ్విన్ ఈ విధంగానే చేశాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో షమీ ఈ విధంగానే చేశాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ కరుణరత్నేను షమీ పెవిలియన్ కు చేర్చాడు. టీమిండియా సభ్యులు షమీని అభినందించే సమయంలో అశ్విన్ షమీ తలను తబలా వాయించినట్లు వాయించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.